కరోనా.. కరోనా.. కరోనా..  మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు వినిపిస్తోంది.  ఎవరిని కదిలించినా కూడా హృదయ విదారక గాద బయటకి వస్తుంది. చైనా లో వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని పట్టిపీడిస్తోంది ఈ మహమ్మారి వైరస్.  ఇక ఈ మహమ్మారి వైరస్ ను ప్రపంచ దేశాలు వదిలించుకోవడానికి ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక దశ కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాము అని అనుకునే లోపే రూపాంతరం చెందుతున్న ఈ రక్కసి మరోసారి పంజా విసురుతోంది. దీంతో ప్రపంచ ప్రజానీకం మొత్తం దిక్కుతోచని స్థితిలో పడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 అయితే మొన్నటి వరకు సెకండ్ వేవ్ ప్రభావంతో  ప్రపంచ దేశాలు అల్లాడి పోయాయి. ఊహించని రీతిలో వేగంగా దూసుకొచ్చిన సెకండ్ అల్లకల్లోల పరిస్థితుల ను సృష్టించింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చూస్తూ చూస్తుండగానే కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. విపత్కర పరిస్థితులు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నాయి. అదే సమయంలో అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇలాంటి నేపథ్యంలో పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్ లు మాత్రం మళ్లీ భయపెడుతున్నాయి.



 ఇటీవల బ్రిటన్లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవలే బ్రిటన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటికే యూకేలో పలు రకాల కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ మరింత భయపెడుతోంది. ఇక ఈ కొత్త వేరియంట్ను అండర్ ఇన్వెస్టిగేషన్ గా యూకే ప్రభుత్వం గుర్తించింది. ఇక ఈ కొత్త వేరియంట్ను బి 1.621 బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇటీవలే కొలంబియాలో ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: