ఎట్ట‌కేల‌కు ఓ నిర్ణ‌యం.. ప్ర‌వీణ్ బీఎస్పీలో చేర‌డం ఖాయం.ఇందుకు మార్గం సుగ‌మం..ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి..న‌ల్గొండ నుంచి ఆరంభం అయ్యే ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం..ఇక‌పై మ‌రింత వేగం పుంజుకోనుంది..ఆయ‌న వెంట స్వేరోస్ న‌డ‌వ‌నున్నారు..
ఇదీ సంక్షిప్త రూపం..ఇప్ప‌టికి..ఇక న‌మ్మిన శ‌క్తులు, ద‌ళిత, గిరిజ‌నులు ఆయ‌న వెంట ఉంటారా లేదా అన్న‌ది కొంత సందిగ్ధం. ఎం దుకంటే  ఇలానే ఆశ‌యాల సాధ‌న‌కు వ‌చ్చిన జేడీ, జేపీ అంతా వెనుకంజ‌లో ఉన్నారు. అది వారి ఓట‌మి కాకున్నా పాల‌క శ‌క్తుల ను ఢీ కొన‌డం సిద్ధాంతాలు వ‌ల్లెవేసినంత సులువు కాదు. ఏదేమైన‌ప్ప‌టికీ రాజ‌కీయంలో ఉండేదంతా రాజ‌కీయం కాదు.. కాక‌పో వచ్చు..అయితే ఇక్క‌డ నెగ్గ‌డంలో బ‌హుజ‌నుల వైఫ‌ల్యం సుస్ప‌ష్టం..ఈ వైఫల్యాల‌ను దిద్దుతాన‌ని ఆయ‌న అంటున్నారు..ఆయ న అంటే ఆర్ ఎస్ ప్ర‌వీణ్..అలానే ఉద్యోగ జీవితంలో అవ‌మానాలూ, అవ‌రోధాలూ ఉండ‌వ‌చ్చు.. ఇవ‌న్నీ వ‌ద్ద‌నుకుని ఆశ‌య సాధన పేరుతో తెలంగాణ నార‌ప్ప అడుగులు వేస్తుండ‌డం ఓ విధంగా సాహ‌సం...ఓ విధంగా శ‌క్తికిమించిన ప‌ని కావొచ్చు..


వేదిక : ఎన్ జీ క‌ళాశాల మైదానం, న‌ల్గొండ :  పాల‌క శ‌క్తుల‌ను ఎదుర్కోవ‌డంలో ఫెయిల‌యితే ఇక జీవితాంతం క్షోభ త‌ప్ప‌దు...ఆ ఒత్తిడిని త‌ట్టుకోవ‌డంతోనే సిస‌లు విజ‌యం ఉంది..గురుకులాల బాగు, అభివృద్ధి అన్న‌ది త‌న ప్ర‌త్యేక అజెండా అని ప్ర‌క‌టించి ప‌ని చేసిన ప్రవీణ్ ఇప్పుడు రాజ‌కీయ అరంగేట్రా నికి శుభ త‌రుణం ఆస‌న్న‌మైంది.. కేసీఆర్ స‌ర్కారుపై పోరే త‌న అంతిమ ల‌క్ష్యం అని చెబుతున్న ప్ర‌వీణ్ త‌న ఆశ‌ల సౌధ నిర్మాణా నికి అంతా క‌ద‌లి రావాల‌ని  కోరుతున్నారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీఎస్పీ వైపు అ డుగులు వేస్తూ, త‌న వారినీ ఇటుగా రావాల‌ని పిలుపు ఇస్తున్నారు. కేవ‌లం న‌మ్మిన ఆశ‌యాల కోసం ఉద్యోగ జీవితానికి వీడ్కోలు చెప్పిన ఈ ఐపీఎస్ అధికారి బ‌హుజ‌నుల అ భ్యున్న‌తే ధ్యేయంగా కొత్త పార్టీకి రూప‌క‌ల్ప‌న చేస్తార‌ని అంతా  భావించినా అదంతా అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది.వ‌చ్చే నెల ఎనిమి ది న‌ల్గొండ కేంద్రంగా జ‌రిగే స‌భ‌లో ఆయ‌న బీఎస్పీలో చేరునున్నారు..అని స్ప‌ష్టం అవుతోంది. ఈ స‌భ  నిర్వ‌హ‌ణ‌కు ఎన్ జీ క‌ళా శాల మైదానా న్ని ఎంపిక చేశారు.



ఇదీ ఆయ‌న మాట.. : పాల‌క శ‌క్తుల క‌ద‌లిక‌ల్లో పాలక శ‌క్తుల నిర్ణ‌యాల్లో ఓడిపోతున్న ద‌ళితుల‌ను గెలిపించ‌డం ఆయ‌న ధ్యేయం అని చెబుతున్నారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేస్తున్నారు.. వ‌ర్గ శ‌త్రువును నిర్ణ‌యించాక పోరు అన్న‌ది సులువు అవు తుంది అని చెప్తారు..ఆ విధంగా ఆయ‌న శ‌త్రువును నిర్ణ‌యించుకుని యుద్ధం చేయ‌డం ఇప్పుడొక అనివార్య భావ‌న కావొచ్చు.. కానీ ఇందులో ఉన్న ఒత్తిడిని అధిగ‌మించడం అం సులువు కాదు.. వ‌ర్గ శ‌త్రువులను ఎదుర్కొనేందుకు ముందు ఆర్థిక బలం కా వాలి.. ఆ దిశ‌గా ఆయ న శ‌క్తుల పున‌రేకీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: