బొగ్గు కావాలా నాయ‌నా! ఛ‌లో రామ‌ప్ప

డ‌బ్బులు కావాలంటే రామ‌ప్ప గుడి ద‌క్క‌దు..డ‌బ్బులు వ‌ద్ద‌నుకుంటే సింగ‌రేణికి నిధులు ద‌క్క‌వు.. ఎలా? డ‌బ్బే ముఖ్యం చారిత్ర‌క నిర్మాణాలు ఎలా ఉన్నా ఏంటి? అని అనుకుంటే ఈ క‌థ ముగిసింద‌నే అనుకోవాలి.చ‌రిత్ర పుస్త‌కంలో రామ‌ప్పఆల‌యాన్ని వెతుక్కో వాలి..అలా కాదు అనుకుంటే ఇక్క‌డికి స‌మీపాన సింగ‌రేణి కోల్ కంపెనీ చేప‌ట్టే త‌వ్వ‌కాల‌ను వ‌ద్ద‌నుకోవాలి. ఇప్పుడీ స‌మ‌స్య తెలం గాణ‌ను క‌దిపి కుదిపేయ‌నుంది. కానీ పాల‌కులు క‌ళ్లు తెరుస్తారా లేదా ఆల‌యం సంగ‌తి మాకెందుకు అనుకుంటారా?
ఎలా అంటే...:  యునెస్కో గుర్తింపు మాట ఎలా ఉన్నా ఓ ప్ర‌మాదం మాత్రం మూలుగు జిల్లా వాసుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. కేసీఆర్ మెడ‌కు మ‌రో ఉచ్చు బిగియ‌నుంది. అదేంటంటే..చారిత్ర‌క గుడికి త్వ‌ర‌లో సింగ‌రేణి ఎఫెక్ట్ ప‌డ‌నుంది. ఇక్క‌డ బొగ్గు త‌వ్వ‌కాల‌కు సింగ‌రేణి ఓపెన్ కాస్ట్ స‌న్న‌ద్ధ‌త వ్య‌క్తం చేయ‌డంతో  ఇప్పుడు కొత్త వివాదం రాజు కోనుంది. ఆల‌యానికి కొద్ది పాటి దూరంలోనే బొగ్గు త‌వ్వ‌కాల‌కు సంబంధించి సర్వేలూ, భూ సేక‌ర‌ణ లూ చేస్తోంది కంపెనీ. ఇదే క‌నుక కొనసాగితే బొగ్గు త‌వ్వ‌కాల పేరిట చే ప‌ట్టే బ్లాస్ట్ ల‌కు ఇక్క‌డి ఆల‌యం పునాదుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌నుంది. అలా కాకుండా బొగ్గు త‌వ్వ‌కాలు నిలుపుద‌ల చేస్తే మంచిదే కానీ అది జ‌రిగేలా లేదు..గ‌తంలో దేవా దుల ప్రాజెక్టు నిర్మాణం లో భాగంగా రామ‌ప్ప గుడికి ప్ర‌మాదం ఏర్ప‌డ‌బోతే స్థానికులు ప్ర‌తిఘ‌టించారు.  ఇక్క‌డ సొరంగం త‌వ్వి భీం గ‌ణ‌పురం (భూపాల‌ప‌ల్లి) నుంచి  రామ‌ ప్ప‌కు నీళ్లు త‌ర‌ లించాల‌ని చూస్తే కేంద్ర పురావ‌స్తు శాఖ తీవ్రంగా వ్య‌తిరేకించింది. దీంతో పైపు లైన్ల ద్వారా నీళ్ల త‌ర‌లింపున‌కు ప్ర‌ణాళిక రూపొందించి అమలు వేశారు. రెవె న్యూ అధికారులూ, కోల్ కంపెనీ పెద్ద‌లూ ఇప్పటికే భూ సేక‌ర‌ణ‌ను షురూ చేయ‌డం జ‌రిగిపోయాక రామ‌ప్ప భ‌విత‌పై క‌మ్ముకొస్తున్న నీలి నీడ‌ల‌ను ఎవ‌రు తొల‌గిస్తారో మ‌రి! ఈ నేప‌థ్యంలో చారి త్ర‌క  క‌ట్ట‌డం ఆన‌వాళ్ల‌ను ప‌రిర‌క్షించ‌డం అంత తేలిక కాకున్నా కోల్ కంపెనీని అడ్డుకునేందుకు ప్ర‌జా సంఘాలు చేసే పోరాటం అందుకు స్థానిక మ‌ద్ద‌తు అన్న‌వే ముఖ్య భూ మిక పోషించి ప్ర‌భుత్వం పున‌రాలోచన చేసుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌వొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: