వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని నిజామాబాద్  జిల్లా ఆస్పత్రి లో 120 ఐసియు బెడ్లను భారత మాజీ క్రికెటర్‌ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా  యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని చాలా మంది జీవితాల్లో చీకట్లు నింపిందని ఆవేదన వ్యక్తం చెందారు క్రికెటర్‌ యువరాజ్ సింగ్.  కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆస్పత్రులలో మామూలు బెడ్స్ లేక.. అనేక ఇబ్బందులు పడ్డారని క్రికెటర్‌ యువరాజ్ సింగ్ అన్నారు. 

అంతేకాదు... ఈ కరోనా వల్ల వెంటి లెటర్ బెడ్స్ దొరకక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.   ప్రతి కుటుంబం లో ఒక్కరైనా ఈ మహమ్మారికి బలయ్యారని వెల్లడించారు యూవీ.  పేద వారికి అలాంటి ఇబ్బంది థర్డ్ వేవ్ లో రావొద్దనే యువికేన్ ఫౌండేషన్ మిషన్ 1000 బెడ్స్ ప్రాజెక్ట్ చేపట్టామని స్పష్టం చేశారు ఈ సిక్సర్ల వీరుడు.  మా ఫౌండేషన్ కు అండగా నిలుసున్న అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.  నిజామాబాద్ ఆసుపత్రి లో మెరుగైన సేవలకు ఈ ఐసియు ఉపయోగపడాలని ఆశిస్తున్నానని చెప్పారు యూవీ. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని.. ఎవరూ కూడా అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు... ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని యువరాజు సూచనలు చేశారు. 

ఎక్కడికి వెళ్లినా... భౌతిక దూరం మరియు మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం తప్పనిసరి అని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యువరాజు వెల్లడించారు. మున్ముందు కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్న ఆయన.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. కాగా..  నిజామాబాద్  జిల్లా ఆస్పత్రి లో 120 ఐసియు బెడ్లను ప్రారంభించడంపై ఆ జిల్లా ప్రజాప్రతినిధులు.. ఎంపీ అరవింద్‌, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: