ముక్కుపచ్చలారని ఒక పసికందు, మరో దివ్యాంగ యువతిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు సంఘటల్లో అత్యాచారానికి గురై జీజీహెచ్‌లో ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్ లో రొంపిచర్ల అత్యాచార బాధితురాలికి మంత్రులు వనిత, సుచరిత ఐదు లక్షల రూపాయల చెక్ అందచేసారు. మాచర్ల మండలం బోధనం పాడులో అపహరణ, దాడికి గురైన ఏడు నెలల బాలిక తల్లిదండ్రులను మంత్రుల పరామర్శించి ధైర్యం చేప్పారు. మంత్రి వనిత మాట్లాడుతూ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిందని, ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం అందించామని అన్నారు. 


మానసిక వికలాంగురాలిని వదిలిపెట్టని భయంకరమైన స్థితిలో ఉన్నారన్న ఆమె అటువంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అలాంటి వారి మీద కఠిన శిక్షలు అమలు చేస్తామని అన్నారు. ఇక అక్కడే చికిత్స పొందుతున్న 28 ఏళ్ళ మతిస్థిమితం లేని యువతిని కూడా పరామర్శించిన అఆమే ఆమె తమ్ముడికి ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ కు చెప్పామని అన్నారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ఆమె ఇటువంటి స్థితిలో సమాజం ఉందంటే బాధపడుతున్నామని పేర్కొన్నారు. 


రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదనే దిశ యాప్ తీసుకొచ్చామని ఆమె వెల్లడించారు. ఇక మానసిక వికలాంగురాలిని, చిన్న పిల్లలను వదిలి పెట్టడం లేదన్న ఆమె ఇక కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ రొంపిచర్ల ఘటన అమానవీయ ఘటన అని, వినపడని, మాట్లాడలేని ఆమెపై అత్యాచారం చేయడం బాధాకరమని అన్నారు. తన బాధను కూడ వ్యక్తం చేయలేని స్థితిలో ఆమె ఉందని, చనిపోతానంటూ బాధితురాలు చెబుతోందని అన్నారు. ఇటువంటి కేసులు విచారణ చేయాలంటే వంద రోజులు పట్టేదని కానీ యాభై రోజుల్లో విచారణ పూర్తయ్యేలా చట్టం తీసుకొచ్చామని అన్నారు. వెంటనే ఉరి వేసే లాంటి చట్టాలు తీసుకొచ్చిన మారేటట్లు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: