హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఏ రేంజిలో విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో మొత్తంలో ఒక స్థాయిలో కేసులో ఉంటే అటు కేవలం హైదరాబాద్ నగరం లోని భారీగా కేసులు వెలుగు లోకి వచ్చాయి  దీంతో నగర వాసులు అందరూ బెంబేలెత్తిపోయారు. అయితే ప్రస్తుతం క్రమక్రమంగా హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే భాగ్యనగరం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.  అయితే మొన్నటి వరకూ కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చిన ప్రభుత్వం ఇక ఇప్పుడూ లాక్ డౌన్ ఎత్తివేసింది.



 అయితే లాక్ డౌన్ ముందు వరకు భయపడిపోయిన జనాలు ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో కరోనా వైరస్ అంటే భయాన్ని కూడా వదిలేసారూ. ఈ క్రమంలోనే ఎవరు కరోనా వైరస్ నిబంధనలు పాటించడం లేదు.. కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండానే బహిరంగ ప్రదేశాలలో గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు భాగ్యనగరంలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి




 ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి తో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. దీనికంతటికీ కారణం ప్రజల నిర్లక్ష్యమే అని అంటున్నారు నిపుణులు. ప్రభుత్వంలాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన నాటినుంచి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదు అని చెబుతున్నారు. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాలలో కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు అని అంటున్నారూ. అయితే ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: