రెబ‌ల్ టైం స్టార్ట్స్ నౌ : మ‌రో ఆగ‌స్టు సంక్షోభం!  

ఎవ‌రున్నా లేకున్నా
పార్టీలు ఉంటాయి
కీల‌క ప‌ద‌వుల బేరం ఉంటుంది

ఈ సారి బేరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో
ఆయ‌న ఎంత చెప్తే అంతే అట‌!
అలా ఇలా కాదు అంతా రేవంత్ వైపే వ‌స్తారు
కేసీఆర్ ను ఒంట‌రి చేస్తారు

కోవ‌ర్టు రాజ‌కీయం
మ‌రో  వైపు కోర్టు భ‌యం
రేవంత్ ఇప్పుడు గాంధీభ‌వ‌న్ రాజ‌కీయాలు న‌డ‌ప‌డం లేదు. ఢిల్లీ కేంద్రంగా మంత‌నాలు న‌డుపుతున్నారు. బెంగ‌ళూరు కేంద్రంగా చ‌ర్చ‌లు చేస్తున్నారు.టీఆర్ఎస్ ఎంత‌గా ప‌నిచేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఎలా ఉన్నా ఇంత‌కాలం పెద్దాయ‌న‌కు త‌లొగ్గి ప‌ని చేసిన వారంతా ఇప్పుడు త‌మ అసంతృప్తిలో భాగంగా అవ‌స‌రం అయిన‌ప్పుడు అవ‌సరం అనుకున్న‌ప్పుడు హ్యాండిచ్చి పోవాలి అని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మెద‌క్ కు చెందిన నేత‌లంతా క‌ట్ట‌గ‌ట్టుకుని ఇటుగా వ‌చ్చి, వచ్చే ఎన్నిక‌ల్లో తామేంటో నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌టికే రేవంత్ కోవ‌ర్టులు కొంద‌రు టీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌ల‌పై ఆయ‌న‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌ని టాక్.ఈ సారి ఎలా అయినా కొన్ని స్థానాల‌యినా గ‌ట్టి పోటీ ఇచ్చి కేసీఆర్ కు చుక్క‌లు చూపించే ప్లాన్ ఒక‌టి రేవంత్ వేశార‌ని కొంద‌రు కాంగిరేసు అభిమానులు అంటున్నారు. సీన్ లోకి చిరు లాంటి వారు వ‌స్తే కాంగ్రెస్ ఇంకా బ‌ల‌ప‌డడం ఖాయం. కానీ రేవంత్ ను ఓటుకు నోటు కేసు వెన్నాడుతుండ‌డంతో కేసీఆర్ ఆ కేసు త‌వ్వ‌కాలు  చేప‌డితే మ‌ళ్లీ త‌న ఇజ్జ‌త్ కు ప్ర‌మాదమేన‌ని భ‌య‌ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ వ్యూహం మాత్రం త‌ల్ల‌కిందులు కాకూడ‌ద‌ని భావిస్తూ, ఏకంగా కొంద‌రు మంత్రులతో కూడా ఆయ‌న ర‌హ‌స్యంగా మాట్లాడుతున్నార‌ని తెలుస్తోంది.

జంప్ జిలానీల‌కు
గ్రేట్ ఆఫ‌ర్..........

టీఆర్ఎస్ నుంచి  కాంగిరేసు వైపు వ‌చ్చేవాళ్లెందరు? ఎందుకు వీళ్లంతా తొంద‌ర‌ప‌డుతున్నారు? రేపు అవునన్నా కాద‌న్నా రేవంత్ హ‌వా న‌డుస్తుంది క‌నుక ఆయ‌న చెప్పిన మాట నెగ్గుతుంది క‌నుక ఇప్ప‌టి నుంచి బేరాలు మొద‌ల‌య్యాయి. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా న‌ల‌భై మంది నాయ‌కులు కాంగ్రెస్ వైపు వ‌స్తున్నారు. వీళ్లంద‌రిలో కొంద‌రు రేవంత్ తో ఆల్రెడీ మాట్లాడారు. దీంతో కే సీఆర్ ఈ ఆగ‌స్టు సంక్షోభానికి భ‌య‌ప‌డిపోతున్నారు. వెళ్లే వాళ్లు వెళ్తారు అని అనుకునేందుకు లేదు ఒక‌టి కాదు రెండు కొన్ని వం ద‌ల మంది కార్య‌క‌ర్త‌ల‌ను వెంట బెట్టుకుని వెళ్లేలా ఈ ప‌ని ఉండ‌బోతోంది. ఇప్పుడే చెప్ప‌లేం కానీ వీటిపై క్లారిటీ త్వ‌ర‌లో వస్తుంది.ఢిల్లీ పెద్ద‌ల‌కు సైతం స‌మాచారం అంద‌కుండా ఉండ దు కానీ ఈ సారి రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల‌ని అధిష్టానం భావిస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాల‌లో రాహుల్ - ప్ర‌శాంత్ కిశోర్ - రేవంత్ - టీఆర్ఎస్ రెబ‌ల్స్ ఈ ఈక్వేష‌ న్ ను ఓట‌ర్లు ఎలా చూస్తారో చూడాలిక !


మరింత సమాచారం తెలుసుకోండి: