మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఎస్సి ఎస్టీ బాలుర పాలిటెక్నిక్ హాస్టల్ ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి గారితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం లో విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 

రూ. 127 కోట్లతో 17  పాలిటెక్నిక్ భవనాలు నిర్మించటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కలశాలల ఏర్పాటు..ఇందులో నాలుగు బాలికలకు, ఒకటి ఎస్ టి బాలుర కు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సుమారు 2200 మంది ఎస్ సి, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని.. 22 హాస్టళ్లను ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలతో నిర్మించాలని 66 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు.  పదవ తరగతి,ఇంటర్ తర్వాత బాలికలు విద్యా ఆపకుండా  33 మహిళ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.
 
విదేశాల్లో చదివే వారికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా అండగా ప్రభుత్వం ఉందని..  ప్రపంచం తో  మన తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు 4 వేల కోట్లు మంజూరు చేశామని... ప్రయివేటు కు దీటుగా అత్యాధునికంగా మార్చటానికి కృషి చేస్తుమని వెల్లడించారు. ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో సి ఎస్ ఆర్ నిధులతో ఐ టి ఐ నూతన భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం సిఎం కెసిఆర్ అనే కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: