రాజ‌కీయంలో ఓడిపోవ‌డం ఉండ‌దు
ఓడించేందుకు దారి ద‌ర్వాజా వెత‌క‌డం ఉంటుంది

ఆమెకు అందుకు త‌గ్గ త‌లుపులూ కిటికీలూ
తెర‌చే ఉన్నాయి..అందుకే ఆమె పార్టీ వీడి వ‌చ్చిన్రు

ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చ‌లు నెర‌పుతూ
తాను ఏ పార్టీలో చెరే అవ‌కాశం ఉందో
తేల్చి చెప్ప‌ని లేదా  చెప్ప‌నీయ‌ని చాక‌చ‌క్యం ఆమెకు
ఉంది క‌నుక పిచ్చి ఎవ్వ‌రిది? ఎవ్వ‌రికి? అన్న‌ది
తేల్చాల్సింది  వైఎస్సార్టీపీ తాజా మాజీ నేత ఇందిరా శోభ‌న్
చెప్పాలి.. అందుకు త‌గ్గ కార‌ణాలు కూడా దాచ‌కండి మేడ‌మ్

కేసీఆర్ నో, ష‌ర్మిల‌నో తిట్ట‌డంతో రాజ‌కీయం మారిపోదు. కానీ అలా మారిపోతుంది అనుకోవ‌డం విడ్డూరం. ఇలాంటి కోవ‌లో ఇంది రా శోభ‌న్ అనే మాజీ నేత (వైఎస్సార్టీపీ) ఉన్నారు. త్వ‌ర‌లో కాంగిరేసులో చేరిపోతారు. పోనీ అక్క‌డ‌యినా ఉంటారో ఉండ‌రో కానీ వై ఎస్సార్ అభిమానులంతా ఆమెకు మునుప‌టి గౌర‌వం ఇస్తారా ఇవ్వ‌రా అన్న‌దే ఇప్ప‌టి ప్ర‌శ్న. వాస్త‌వానికి వైఎస్సార్ అంటే అభి మానంతోనే ష‌ర్మిల ప్రారంభించిన పార్టీలో చేరాన‌ని చెప్పిన ఆమె ఆయ‌న ఆరాధ‌కురాలిగానో,లేదా అనుచ‌రురాలిగానో అక్క‌డే  ఉం డాలి. ఉంటే విలువ..ఉన్న‌ప్పుడే గౌర‌వం.  ఇదంతా వ‌ద్ద‌నుకుని,యాష్ అనుకుని,ట్రాష్ అనుకుని బ‌య‌ట‌కు పోవ‌డం అర్థం లేదు. ఇప్పుడిప్పుడు పుట్టిన పార్టీల‌లో ఇలాంటి ప‌రిణామాలు మంచివి కాకున్నా రాజ‌కీయాల‌లో ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌న వంతు త‌ప్ప‌క కావాలి.



అన‌డం సులువు..అనిపించుకునేట‌ప్పుడు ప‌డే బాధ త‌ట్టుకోవ‌డం క‌ష్టం. పార్టీలో చేర‌డం సులువు. వ‌దిలిపోయేట‌ప్పుడు చెత్త,పి చ్చి లాంటి ప‌దాలు వాడ‌కుండా వ‌దిలేయ‌డం క‌ష్టం. అక్క‌డున్న‌దంతా చెత్త అయిన‌ప్పుడు మీరెందుకు చేరారు అన్న ప్ర‌శ్న వ‌స్తే
అప్పుడు ఆమె ఏం చెప్తారు? ఏం లేదు వైఎస్సార్ అనే వ‌ర్డ్ కు నేను అభిమానిని అందుకే చేరాను అంటారు. అంత అభిమానం ఉంటే ఎందుకు పార్టీ వీడారు అంటే ఆమె చుట్టూ చేరిందంతా చెత్త అని నిర్థార‌ణ అయిపోయింది అందుకే వ‌దిలేశాను లేదా వ‌దిలి వ‌చ్చేశాను అని అంటారు. ఇదంతా వైఎస్సార్టీపీ నేత ఇందిరా శోభ‌న్ చెబుతున్నారు. ఆమె చెప్ప‌డంలో బాధ ఉందో లేదో కానీ  విన‌డంలో మాత్రం అస్స‌లు అంగీకారం లేదు విన్న‌వాళ్ల‌కు..మ‌రియు చూసిన‌వాళ్ల‌కు. పార్టీ ని వ‌దిలేశాక ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి శ్రీ‌నివాస్ తో ఆమె చెప్పిన మాట‌లు ఇవి. ఈ మాట‌లు ఆధారంగా ఆమె మంచి వారో స్థిరం ఉన్న వారో లేనివారో అన్న‌ది ఎవ‌రికి వారు అర్ధం చేసుకోవాలి.



పార్టీలో దిగువ స్థాయి నేత‌ల‌ను అలా తిట్ట‌డంలో అర్ధం లేదు కానీ పార్టీలో ఉంటూ ఆమె తిడితే, ఆ విధంగా తిట్టి ఏమ‌యినా సాధిం చ‌గ‌లిగితే ఆలోచించాలి ఆమె స్థాయి ఎంత‌న్న‌ది? ఏంట‌న్న‌ది? ఇప్పుడ‌ది కుద‌ర‌ని ప‌ని కనుక  వైఎస్సార్టీపీని వ‌దిలి వ‌చ్చిన నేత లు పిచ్చి, చెత్త లాంటి ప‌దాలు ఇంకెన్ని వాడినా  పార్టీ వీడిపోయాక వారికి విలువ ఉండదు. వారు చెప్పే చిల‌క‌ప‌లుకులు మరో పార్టీకి అస్త్రాలు అవుతాయో లేదో కానీ నిజాయితీతో రాజ‌కీయం చేసేవారికి అవి అంగీకారం మాత్రం కావు. ఇప్పుడామె  రేవంత్ సార‌థ్యంలో ప‌నిచేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే ఆమె వెళ్లేది అక్క‌డికే!

మరింత సమాచారం తెలుసుకోండి: