ఇలా ప్రశాంతతకు మారుపేరు అయినటు వంటి దేశాలలో మత తీవ్రవాదం పెను ప్రమాదం సృష్టించింది అనడానికి.. బిన్ లాడెన్ లాంటి వాళ్లే సాక్ష్యం. ఇలాంటి వాళ్లు ఏకంగా దేశ పౌరులనే మాయమాటలతో తమవైపుకు తిప్పుకుని దేశంలో అల్లకల్లోల పరిస్థితుల సృష్టించేందుకు వారినే పావులుగా వాడుకుంటూ ఉంటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా బిన్ లాడెన్ ఎన్నో దేశాల్లో ఉగ్ర కుట్రలు చేసి దారుణ పరిస్థితులకు కారణం అయ్యాడు. అయితే ఇక ఇటీవలే ప్రశాంతతకు నిలయమైన న్యూజిలాండ్ లో మొట్టమొదటిసారి ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా తీవ్రవాద భావజాలాన్ని కలిగిన ఒక వ్యక్తి న్యూజిలాండ్ దారుణంగా వ్యవహరించడం ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.
ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలం కలిగి ఉన్న ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకుని సూపర్ మార్కెట్లో కనబడిన ప్రతి వ్యక్తిని కూడా కత్తితో దాడి చేస్తూ వెళ్లాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఏకంగా ఆరుగురిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం ఈ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు న్యూజిలాండ్ లో ఉగ్రవాదం అనే మాటే వినిపించలేదు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. కాని మొదటి సారి ఐ ఎస్ ఐ ఎస్ తీవ్రవాద భావజాలం కలిగి ఉన్న ఒక వ్యక్తి సృష్టించిన వీరంగం మాత్రం ఆ దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. దీనిపై ఇక ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి