తల్లీ... అనుమతించవమ్మా...
రానున్న కొద్ది మాసాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ  ప్రజలకు చేరువయ్యోందుకు నానా తంటాలు పడుతోంది. పార్టీకి పూర్వ వైభవం తెప్పించ్చేందుకు  కాంగ్రెస్ సీనియర్ నేతలు మేథోమధనం చేస్తున్నారు. కొద్ది రోజులుగా  ఆ పార్టీలోని వివిధ కమిటీలు నిత్యం సమావేశ మవుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వం లోని  ఓ కమిటి వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కమిటీ తాజాగా సోనియా గాంధీకి ఓ లేఖను రాసింది.  ఈ నెల 27న రైతులు  సమైక్య కిసాన్ మోర్చా నేతృత్వంలో తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరింది. ఇందుకు సోనియా గాంధీ అనుమతిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ కమిటీలో ఏ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ కుమార్త  ప్రియాంక వద్రా కూడా సభ్యురాలిగా ఉన్నారు.
నరేంద్ర మోడి నేతృత్వం లోని కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రైతలు రోడ్డునబడి నిరసనలు చేస్తున్నా ప్రధాని ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు.ర కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యలయ సిబ్బంది  హుటా హుటిన  వివిధ రాష్ట్రాల పి.సి.సిలకు లేఖలు రాశారు. బంద్కు మద్దతు తెలపాలని సూచించారు. బ్లాక్ స్థాయి నుంచి  కాంగ్రె స్ పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ లేఖలో సూచించారు. పార్టీ ఎం.ఎల్.ఏలు, ఎం.పిలుతో సహా వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్న వారంతా బారత్ బంద్ విజయవంతం అయ్యోల చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్-19 సూచనలను తప్పని సరిగా పాటించాలని స్పష్టంగా పేర్కొన్నారు.
రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాల పై  గత నెల20 వ తేదీ  కాంగ్రెస్ తో సహా 18 పార్టీల నేతలు వర్చువల్ గా సమావేశమయ్యారు. రైతు చట్టాలపై తమ వైఖరేంటో చర్చించారు. తాజాగా  ఈ నెల 27 న నిర్వహించనున్న రైతు బంద్ కు మద్దతు నిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: