తెలంగాణా పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తుండటం ఇప్పుడు ఆసక్తికర చర్చలకు దారి తీసింది. తెలంగాణా బిజెపి నాయకులు అందరూ కూడా ఆయన పర్యటనకు నిర్మల్ లో భారీ ఏర్పాట్లు చేసారు. బండి సంజయ్ నేడు తన పాదయాత్రకు విరామం ఇచ్చి అమిత్ షా యాత్రపై దృష్టి మళ్ళించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు మహారాష్ట్ర నాందేడ్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకుంటారని బిజెపి వర్గాలు ధ్రువీకరించాయి.

నాందేడ్ లో పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని మీడియాకు విడుదల చేసిన షెడ్యూల్ లో తెలిపారు. మధ్యాహ్నం 1.50 గంలకు నాందేడ్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 2.30 గంలకు నిర్మల్ చేరుకోనున్న కేంద్రమంత్రి... పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అని బిజెపి తెలిపింది. 2.45 గంలకు నిర్మల్ సభా ప్రాంగణంలో మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం సందర్శిస్తారు అని తెలిపారు. అనంతరం సర్థార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు ఆయన.

 బిజెపి  అగ్ర నేత కాబట్టి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. లక్ష మందికి పైగా ఈ సభకు హాజరు అయ్యే అవకాశం ఉందని బిజెపి అంచనాలు వేసుకుంటుంది. పలువురు తెలంగాణా నాయకులను తమ పార్టీలోకి ఆయన సాదరంగా ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతుంది. మధ్యాహ్నం 3.15 నుంచి 4.50 గంటల వరకు నిర్మల్ సభలో అమిత్ షా పాల్గొంటారు అని బిజెపి తెలిపింది. సాయంత్రం 5 గంలకు హెలికాఫ్టర్ లో నాందేడ్ వెళ్తారని వివరించారు. 5.45 గంలకు అక్కడ నుంచి ఢిల్లీకి ఆయన వెళ్తారు. రాత్రి 7.30 గంటలకు తిరిగి ఢిల్లీకి చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి... సమీక్షా సమావేశంలో పాల్గొంటారట. నేడు తెలంగాణా విమోచన దినం సందర్భంగా ఆయన రావడం ప్రకంపనలు సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: