17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేసారు. కేసీఆర్ తన తప్పును తెలుసుకొని అమరుల ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ఆయన కోరారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం అని ఆయన తెలిపారు. మజ్లీస్ కనుసైగల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు పనిచేస్తున్నాయి అని విమర్శలు చేసారు. తెలంగాణ ఆత్మ గౌరవం.. ఆకాంక్షల సమస్య అన్నారు ఆయన. మజ్లీస్ ఏది చెబితే అది అమలు అవుతుంది అని ఈ సందర్భంగా విమర్శలు ఎక్కు పెట్టారు.

కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయి అన్నారు ఆయన. సెప్టెంబర్ 17 అన్ని పార్టీలు చేయాల్సి న పరిస్థితి వచ్చింది.. కానీ ప్రభుత్వ పరంగా గ్రామ గ్రామాన జరగాలి అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. కుహనా లౌకిక వాదులకి, ఓటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలి  అని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కేసీఆర్ వైఖరి ని మజ్లీస్ దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించే ఫైల్... రెండో సంతకం తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెడుతూ సంతకం అని అన్నారు.

మరో బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ... మజ్లిస్ పార్టీకి లొంగి.. కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్ కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదు అని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్ర ను తెరమరుగు చేస్తున్నారు అన్నారు. నిజాంకి కేసీఆర్ కి ఎలాంటి తేడా లేదు . ఊసరవెల్లిలా కేసీఆర్ రంగులు మారుస్తున్నాడు అని విమర్శించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts