తెలంగాణలో పెద్ద మనుషుల పాత్ర ఎక్కువయిపోతోంది. తద్వారా రాజకీయం నీతులు ఎక్కువ వినిపిస్తోంది. అదే తరహాలో బూతులు కూడా! ఇప్పుడు ఎవరిని నిందించాలి. పదవిని అడ్డం పెట్టుకుని ఇంత దిగజారే భాషకు ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేయాలా? లేదా గతంలో పెద్దాయన భాష కూడా  ఇలానే ఉండేది కదా అని సర్దుకుపోవాలా?


డ్రగ్ కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. రాజకీయంగా పెను తుఫాను సృష్టిస్తోంది. అప్పుడెప్పుడో తవ్వి వదిలేసిన కేసును ఈడీ బూజు దులపడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా చురుకైన ముఖాలు ఈ కేసు విషయమై మీడియా ముందుకు మరో మారు వచ్చి ఎప్పటిలానే ఏదో నాలుగు మాటలు దర్యాప్తు గురించి చెప్పి వెళ్లాయి. ఇవేవీ గతంలో చెప్పిన మాటలకు భిన్నం కాకపోయినా ఏదో చెప్పి తప్పించుకోవడం కన్నా గతంలో అలవాటులో ఉన్న మాటలే చెబితే ఓ పనైపోతుందని టాలీవుడ్ ముఖాలు అనుకున్నా యి. ఆఖరికి కేసు ఏం తెలుతుందో కానీ ఇప్పటిదాకా చేసిన పరీక్షల అనంతరం పూరీ జగన్నాథ్ కు, తరుణ్ కు ఈడీ క్లీన్ చిట్ ఇ చ్చింది.

దీంతో పూరీ అండ్ కో ఊపిరి పీల్చుకుంటోంది. మరోవైపు మిగతా సెలబ్రిటీల విషయమై ఈడీ ఏం చెబుతుందా  అనే ఆసక్తి అయితే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ కేసు తేలిపోయినా, రేపటి వేళ మళ్లీ తవ్వరని ఏంటి గ్యారంటీ? డ్రగ్ మాఫియా ఒక్క టాలీ వుడ్ లోనే ఉందా లేదా టాలీవుడ్ తోనే ఉందా?

భాగ్య నగరి గల్లీలను సోదా చేస్తే ఇంకా ఎక్కువ నిజాలు తెలిసివస్తాయి అని కొందరు టాలీవుడ్ మనుషులు అంటున్నారు. ఇదే తగాదాలో రేవంత్ పెద్ద మనిషి పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చాడు. కేటీఆర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ నూ నానా మాటలూ అన్నాడు. ఏం అన్నా ఏం చేసినా ఇవన్నీ మీరు నేర్పిన విద్యలే అంటూ తన పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నా రు. ఇప్పుడీ కేసులో తాను ఏ పరీక్షకు అయినా సిద్ధమేనని కేటీఆర్ చెబుతుండగా, ఇదే పరీక్షకు రాహుల్ సిద్ధమా అని సవాల్ కూడా చేశారు. వీటిపై రేవంత్ ఎలా స్పందించినా ఈ తగాదా కేవలం అధికార యావలో భాగం తప్ప అంతకుమించి ఏం లేదని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg