అఫ్గ‌నిస్తాన్ ను ఆక్ర‌మించిన తాలిబ‌న్‌లు తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, తాలిబ‌న్‌ల‌కు మొద‌టి నుంచి స‌పోర్ట్ పాకిస్తాన్ నిలిచింద‌ని అంత‌ర్జాతీయంగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమెరికా బ‌ల‌గాలు తొల‌గిపోవ‌డంతో 20 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి తాలిబ‌న్‌లు అఫ్గ‌నిస్తాన్‌ను స్వాధినం చేసుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేవ‌ర‌కు పాకిస్తాన్ పాత్ర ఎంతో కొంత ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తూ ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యాన్ని క‌ల్పిస్తున్న టెర్ర‌రిస్ట్ దేశంగా పాకిస్తాన్ అంత‌ర్జాతీయంగా పేరు తెచ్చుకుంది.


  ఈ క్ర‌మంలో తాలిబ‌న్‌ల ప్ర‌భుత్వంలోని కొంద‌రు నాయ‌కులు పాకిస్తాన్ మూలాలు క‌లిగిన వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అఫ్గ‌న్‌ను తాలిబ‌న్ ఆక్రమించుకుంటున్న స‌మ‌యంలో తాలిబ‌న్‌ల పై  పాకిస్తాన్ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. పంజ్‌షేర్‌లో తాలిబ‌న్‌ల‌కు అక్క‌డి స్థానిక పోరాట‌యోధుల‌కు జ‌రిగిన పోరులో పాకిస్తాన్ తాలిబ‌న్‌ల‌కు సహాయం చేసింద‌ని వార్త‌లు కూడా వచ్చాయి. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసి వ్యాఖ్యలు చ‌ర్చ‌కు దారి తీసాయి. తాలిబ‌న్‌ల‌తో చ‌ర్చిస్తామ‌ని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశం అయింది. ఒక ప‌క్క‌న తాలిబ‌న్‌ల‌ను ప్ర‌పంచం మొత్తం అస‌హ్కించుకుంటోంది. క్ర‌మ‌క్ర‌మంగా వారి అస‌లు రూపాన్ని భ‌య‌ట‌పెడుతున్న సంద‌ర్భంలో ప్ర‌భుత్వంలోని మార్పుల గురించి ఇమ్రాన్‌ఖాన్ చ‌ర్చిస్తాడట‌.


   ప్ర‌భుత్వంలో ఉజ్బెకీలు, హ‌జారీలు, త‌జ‌కీలకు కూడా వాటా ఇవ్వాల‌నే విష‌యం పై తాలిబ‌న్‌ల‌తో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతాన‌న్నారు. అలాగే ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడే విధంగా వారిని చ‌ర్య‌లు తీసుకోమ‌ని చెబుతాన‌ని తెలిపారు. చైనా షాంగై కో ఆప‌రేటివ్ స‌మావేశంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో ఇత‌ర వ‌ర్గాల వారికి స్థానం క‌ల్పించాల‌ని, అఫ్గ‌న్ ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మార‌కూడ‌ద‌ని, ఉగ్ర‌వాదాన్ని ప్రొత్స‌హించ‌కూడ‌ద‌ని చేసి కీల‌క వ్యాఖ్య‌ల సంద‌ర్భంగా.. ఇమ్రాన్ ఖాన్ ఇక తాలిబ‌న్ ల విష‌యం త‌న భుజాల‌పై వేసుకుంటున్న‌ట్టు బిల్డ‌ప్ కొడుతూ ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు తెలిస్తోంది. మ‌రీ ఈ ప్ర‌క‌ట‌న ఎంత వ‌రకు నిజం చేస్తాడో లేదో వేచి చూడాలి.








మరింత సమాచారం తెలుసుకోండి: