ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో న్యూస్ మీడియా రంగం ఆర్థిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుంది. 2003 నుంచి 2008 వ‌ర‌కు మీడియా రంగం విస్తృతంగా పెరిగిపోయింది. త‌రువాత ఫైనాన్షియ‌ల్ క్రైసిస్‌ను ఎదుర్కొన్నాయి.  ళ్లి ఇప్పుడు అదే ప‌రిస్థితి వ‌చ్చేందుకు అవ‌కాశం క‌నిపిస్తోంది.  న‌డ‌ప‌డానికి స్థోమ‌త లేక చాలా ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెళ్లు అమ్మ‌కానికి సిద్ద‌మ‌య్యాయి. దేశంలో ఉన్న టాప్ ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెల్స్ ఇన్‌క‌మ్ త‌గ్గిపోతోంది. భార‌తదేశంలో అడ్వ‌ర్ట‌యిజ్ రంగంలో కేవ‌లం 8శాతం మాత్ర‌మే న్యూస్ ఛానెల్స్‌కు, ప‌త్రికా రంగం వాటా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎంత త‌క్కువో అర్థ‌మ‌వుతుంది. ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెల్స్ ఆర్థిక ప‌రిస్థితులు బాగా లేక అమ్మేసే ప‌రిస్థితికి చేరుకుంది.


    మీడియా రంగం ప‌డిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క‌రోనా క్రైసీస్‌. ఇందులో మ‌రి ప‌త్రిక‌లు బాగా దెబ్బ‌తిన్నాయి. టీవీ ఛానెల్స్ వ్యూస్ షిప్ పెరిగింది కానీ దానికి త‌గ్గ‌ట్టుగా ఇన్‌క‌మ్ పెర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నించాలి. క‌రోనా టైమ్‌లో వ్యూస్‌షిప్ పెరిగినా.. వ‌స్తువినియోగం త‌గ్గ‌డంతో కంపెనీల బిజినెస్ ఆటోమెటిక్‌గా త‌గ్గిపోతుంది. దీని కార‌ణంగా మీడియాకు వ‌చ్చే అడ్వ‌రైజింగ్ ఇన్‌క‌మ్ భారీగా త‌గ్గిపోయింది. ఇక దీనికి తోడు డిజిటల్ మీడియా గ‌ణ‌నీయంగా పెరిగింది. వాస్త‌వానికి ఫిజిక‌ల్‌గా ఉన్న ఛాన‌ల్స్‌, ప‌త్రిక‌ల నిర్వ‌హ‌ణ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.


    మీడియాలో సంక్ష‌భం వ‌స్తే మ‌న‌కేంటి అనుకుంటే.. ఇక్క‌డ రెండు విష‌యాలు గ‌మ‌నించాలి. ఒక‌టి మంచి వార్త‌లు అందించే ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెల్స్ అడ్ రెవెన్యూ త‌గ్గ‌డం ద్వారా మంచి కంటెంట్‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌లేరు. రెండ‌వ‌ది పెద్ద మీడియా రంగాల‌ను పేరున్న ఛానెల్స్‌ను, ప‌త్రిక‌ల‌ను కార్పోరేట్ వాళ్లు కొనుగోలు చేస్తారు. వాళ్ల‌కు వీటి ద్వారా లాభాలు రావాల‌ని ఏం ఉండ‌దు ఎందుకంటే వాళ్ల బిజినెస్ ఘ‌న‌నీయంగా ఉంది. ఇప్ప‌టికే మీడియా రంగంలోకి టాటాలు, అంబానీలు వ‌చ్చారు. ఇప్పుడు అదానీలు కూడా ఎంట‌ర్ అవుతున్నారు.



  మీడియా ను త‌మ చేతుల్లోకి తీసుకుని వారికి అనుకూలంగా ఉన్న ప్ర‌భుత్వాని గురించి వార్త‌లు రాస్తూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్తారు దీని వ‌ల్ల వాళ్ల‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక విధానాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. దీని వ‌ల్ల పత్రిక‌కు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మీడియా కార్పొరేటీక‌ర‌ణ అయితే, వ్య‌క్తిపూజ‌, లేదా స్వ‌లాభం కోసం వార్త‌లు రాసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై వార్త‌లు రాసే అవ‌కాశం త‌గ్గిపోతుంది.
   

   

 

మరింత సమాచారం తెలుసుకోండి: