వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలపై మంత్రులు, ఎమ్మెల్యే తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ప్రతీ రోజు ఎంపీ మీడియా సమావేశాలతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. సిఎం జగన్ బెయిల్ కూడా రద్దు చేయాలని ఆయన సిబిఐ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై రెండు మూడు నెలలు పెద్ద ఎత్తున చర్చలు కూడా మనం విన్నాం. టీడీపీ కి పరోక్షంగా సహకరించే వారు కూడా దీనిపై ఆశగా ఎదురు చూసారు.

తాజాగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక విమర్శలు చ్చేసారు. వెంకటేశ్వరస్వామి... అల్లా... ఏసును ప్రజలు ఎలా ఆరాధిస్తున్నారో పేద ప్రజలంతా జగన్ ను ఆరాధిస్తున్నారు అని పేర్కొన్నారు. రఘురామ కృష్ణంరాజు ఆరోపణలు బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో చేతులు కలిపి గెలిచిన పార్టీ పైనే విషం చిమ్ముతున్నాడు అని అన్నారు. రఘురామది రాక్షస మనసత్వం అని ఉప ముఖ్యమంత్రి విమర్శలు చేసారు. ఎంపీగా ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి రఘురామ అని ఆయన అన్నారు.

ఎంపీగా గెలిచి చంద్రబాబు వాల్ల కాదని... కాని రఘురామ...జగన్ ను వెన్నుపోటు పొడుచేందుకు యత్నిస్తూ ఉన్నాడని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను మోసం చెయ్యలేవు అంటూ రఘురామను ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. చంద్రబాబు, రఘురామతో పాటు దేశంలోని అందరూ కలిసినా జగన్ ను ఏమి చెయ్యలేరు అన్నారు ఆయన. డ్రగ్స్ అక్రమ రవాణా పై విచారణకు ఆదేశించాం అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారీ పై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు ఆయన. గతంలో చంద్రబాబు అనుచరులే నాటు సారాయి వ్యాపారం చేశారు అని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు పదే... పదే... తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap