ఏపీ బీజేపీ తమ నాయకుడు మోడీ చిన్ననాటి విషయాలను ట్వీట్ ద్వారా పంచుకున్నారు. మోడీ చిన్ననాటి నుండే సాహసాలు చేస్తున్నారని, దానికి ఉదాహరణగా ఒక కధ కూడా చెప్పారు. చిన్నప్పటి నరేంద్ర ఎంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకునే వారని, ఆయన రోజు మొసళ్లు ఉన్న చెరువులో ఈతకు వెళ్లేవారని చెప్పారు. అలా ఈతకు వెళ్లిన సందర్భంలో ఒకరోజు చిన్న మొసలి పిల్లను పట్టుకున్నారని, దానిని తన ఇంటికి కూడా తీసుకెళ్లారని చెప్పారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న స్నేహితులు నరేంద్ర సాహసానికి భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. అయితే నరేంద్ర తల్లి సూచన మేరకు ఇంటికి తెచ్చిన మొసలి పిల్లను తిరిగి చెరువులో వదిలి వచ్చినట్టు చెప్పారు. దీనికి సూచికగా ఒక చిత్రాన్ని కూడా ఆ నేతలు ట్వీట్ లో పంచుకున్నారు.

ఇదంతా ఆయన గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో చేసిందా లేక ఏపీ బీజేపీ తమను ఒకసారి పట్టించుకోవాలని మోడీకి  దరఖాస్తు కింద చేసిన పనా అనేది మాత్రం సందేహంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో ఉపఎన్నికల హడావుడి నెలకొంది. దానికోసం బీజేపీ వర్గాలు తీవ్రంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రచారం  చేస్తున్నారు అంటే తెలిసిన విషయమేగా, గల్లీ నేతల నుండి ఢిల్లీ నేతల వరకు అందరూ ప్రచారానికి వచ్చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో త్వరలో జరగనున్న ఉపఎన్నికకు మోడీని ఈ ట్వీట్ ద్వారా ఆహ్వానించారా అనేది స్పష్టం అవడం లేదు. అయినా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రమ్మని అడిగితే మోడీ రాడా ఏమిటి అనే ప్రశ్న నెలకొంటుంది ఈ ట్వీట్ చుసిన వారిలో.

పోనీ ఇక్కడ తమవలన కావట్లేదని, ఒక్కసారి ఏపీకి కూడా వచ్చి పొమ్మని ప్రత్యక్షంగా ముఖం చూపించి అడగలేక ఇలా ట్వీట్ చేశారా అని పలు సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ బీజేపీ ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం పలు ఉద్దేశ్యాలను అంటగడుతున్నారు. మోడీ నాయకత్వమే మళ్ళీ దేశప్రజలు కోరుకుంటున్నట్టు ఇటీవల సర్వేలు వెల్లడించడంతో సామజిక మాధ్యమాలలో బీజేపీ వార్తలను మోడీ జీవితాన్ని ప్రచారం చేయాలని అధిష్టానం నుండి ఆదేశాలు జారీ చేశారేమో అనే సందేహం కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు మోడీ హవా కోసం ప్రచారం ఇప్పటి నుండే ప్రారంభించారా .. అంటూ నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అసలు బీజేపీ ఎందుకు ఈ ట్వీట్ చేసిందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: