మ‌ల్ల‌న్న‌కు ఒక క‌ల ఉండె. ఆయ‌న ఎమ్మెల్యే కావాల‌ని. అందుకు ఏద‌యినా ప్ర‌య‌త్నం చేయ‌మ‌నండి ఎవ్వ‌రూ కాద‌న‌రు. మ‌ల్ల‌న్న‌కు ఒక క‌ల ఉండె ఎమ్మెల్సీ కావాల‌ని. అందుకు ఏద‌యినా ప్ర‌య‌త్నం చేయ‌మ‌నండి ఎవ్వ‌రూ కాద‌నరు. కానీ అన‌వ‌స‌ర వివాదాల‌తో ఆయ‌న కాలాన్నీ వృథా చేసుకోవ‌డం అన్న‌ది అస్స‌లు  మంచి ప‌ని కాదు. కేసీఆర్ ను తిడితే హీరోలు అన్న ప‌దం త‌ప్పు.



చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌గా పేరున్న న‌వీన్ త‌న ఛానెల్ క్యూ న్యూస్ ద్వారా ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప‌లు రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌ర నుంచి కూడా డ‌బ్బులు వ‌సూలు చేశాడ‌ని అభియోగాలు ఉన్నా యి. త‌న ఛానెల్ ద్వారా కేసీర్ ను టార్గెట్ చేసి ఆవేశంతో ఊగిపోయిన మ‌ల్ల‌న్న ఇప్పుడు వ‌రువ వివాదాల‌తో జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయ‌న మాట‌ల వేడితో గులాబీ దండును ముచ్చెమ‌ట‌లు పోయించాడ‌న్న సంబ‌రంలో విప‌క్షం ఉన్నా అవేవీ ఎల్ల‌కాలం నిల‌బ‌డ‌వు అని తేలిపోయింది. నిరాధార ఆరోప‌ణ‌లు కొన్ని, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కొన్ని మ‌ల్ల‌న్న‌ను వివిధ కేసు ల్లో  ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. ఆయ‌న రెచ్చిపోయి మాట్లాడినంత మాత్రాన పాల‌కులు భ‌య‌ప‌డిపోరు అన్న‌ది ఒక్క‌టి తెల్సు కుంటే చాలు ఇప్ప‌టికైనా!

తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ న‌వీన్ వివాదాల్లోనే ఉన్నడు. కొత్త వివాదాల‌కు త‌న పేరు త‌గిలించుకుని అదొక గొప్ప విష‌య‌మ‌ని సంబర‌పడిపోతున్న‌డు.. తాజాగా  ఆయ‌న‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయ‌న వ‌రుస కేసుల జాబితా నుంచి బ‌య‌ట ప‌డేలా లేడ‌ని తేలిపోయింది. పాద యాత్ర పేరుతో ఓ క‌ల్లు వ్యాపారి ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన కేసులో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అత‌డు ఐదో నంబ‌రు నిందితుడు. ఆయ‌న‌ను మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రు ప‌రిచారు. ఇప్ప‌టికే ఓ జ్యోతిష్యుడ్ని మోసం చేసిన కేసులో అరెస్ట‌యి రిమాండ్ లో ఉన్నాడు క‌నుక  క‌ల్లు వ్యాపారిని మోసం చేసిన కేసుకు సంబంధించి నిజామాబాద్ పోలీసులు న్యాయ‌మూర్తి ఎదుట న‌వీన్ ను అలియాస్ మ‌ల్ల‌న్న‌ను హాజ‌రుప‌రిచి తిరిగి హైద్రాబాద్ కు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg