దేశంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ సొంత సంస్థల అభివృద్ధికి పూనుకోకుండా ఎప్పుడు ప్రైవేట్ పాట పాడటం అందరికి అలవాటుగా మారిపోయింది. మొత్తం ప్రైవేటీకరణతో పెట్టుబడులు వస్తాయని తద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందనేది వారి ప్రణాళిక అయిఉండవచ్చు. ఇది ఒక నిజమైన నిజాయితీ ఉన్న పార్టీ అధికారం లో ఉన్నప్పటి మాట. కానీ అలాంటివి ఇప్పట్లో కనిపించడం లేదు. ఎవరు వచ్చినా ఏమిటి ప్రయోజనం అన్నట్టే పాలన ఉంటుంది. అయితే ఎవరు అధికారం లోకి వచ్చినప్పటికీ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించినట్టుగా ప్రభుత్వ సంస్థల నిర్వహణ మాత్రం చేయలేకపోవడం శోచనీయం. ఈ తరహా ప్రైవేటీకరణ అభివృద్ధిని పరుగు పెట్టిస్తుందో లేదో కానీ ఆ మాటతో నేతలు వారి సొంత ఖజానా మాత్రం నింపుకోవడం చాలా  జరిగిపోతుంది, అందుకే అసలు ప్రైవేటీకరణ వైపు నేతలు పార్టీలు మొగ్గుచూపుతున్నాయనేది ఉన్న విమర్శ.

అది కూడా నిజమే అన్నట్టే ప్రవర్తిస్తున్నాయి ఆయా పార్టీలు, ప్రభుత్వాలు. ఏదో చిత్రంలో చెప్పినట్టుగా ప్రభుత్వాలు కార్పొరేట్ కనుసన్నలలో నడుస్తున్నాయి తప్ప ప్రజల అవసరాలు తీర్చడానికి కాదనేది స్పష్టం అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేట్ వారికే అన్ని కట్టబెడుతూ ప్రభుత్వ సంస్థలను నిర్లక్ష్యం  చేస్తున్నారు. దీనితో వాటి ని నిర్వహించలేని స్థితికి వచ్చేస్తున్నాయి, అప్పుడు అప్పుల్లో ఉందని అదే సంస్థను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వమే తన సంస్థలను సరిగ్గా నిర్వహించి పెట్టుబడులు ప్రైవేట్ వారి నుండి ఆకర్షించడం వలన ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయి అనేది నిపుణుల సూచన.

ఇవేమి పట్టని ప్రభుత్వాలు మాత్రం వేల కోట్ల భూములను, ఆయా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి కట్టబెట్టేస్తూ ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నివ్వదూ అనే చందాన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఏ నాడు ఉండదు, ఇస్తున్న సంస్థలను అమ్మేసుకుంటూ ఉన్న వి కూడా ఊడపీకేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రభుత్వం ఎంతో విలువైన భూములను ప్రైవే వారికి అతితక్కువ ధరలకు కట్టబెట్టాయని విపక్షాలు గొల్లుమంటున్నాయి. బీజేపీ  గురించి తెలిసిందే, అయితే మతరాజకీయాలు లేదంటే ప్రైవేట్ వారిని నెత్తికెక్కించుకోవడం తప్ప మరొకటి చేయరు. మిగిలిన పార్టీలు గొప్పవని కాదు, దేశంలో అన్ని పార్టీలు అంతకంటే గొప్పగా కూడా ఏమి చేయలేవు, చేయవు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: