ఇటలీ ప్రభుత్వం తాజాగా భారత్ లో తయారైన కోవిషిల్డ్ ను ఆమోదించింది. దీనితో ఇక భారత్ లో ఈ వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇటలీకి  వెళ్ళవచ్చు. ఈ మేరకు అక్కడి భారత రాయబారకార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. తాజా జి-20 దేశాల ఆరోగ్యమంత్రుల సమావేశంలో మన ఆరోగ్య మంత్రి ఇటలీ ఆరోగ్యమంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పటి చర్చలు ఫలించినట్టే ఉన్నాయి. దీనితో మరో దేశం కోవిషిల్డ్ ను ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్ కు చెందిన 16 దేశాలు కోవిషిల్డ్ ను ఆమోదించాయి. దీనితో ఈయూ లోని దేశాలకు వెళ్లాలని అనుకున్నవారు గ్రీన్ కార్డు పొందగలరు.

అయితే ఇటీవల బ్రిటన్ కూడా కొన్ని అభ్యన్తరాలు వ్యక్తం చేసినప్పటికీ మోడీ చొరవతో ఆ పరిస్థితులు మారాయి. అతిత్వరలో బ్రిటన్ కు కూడా భారతీయులు వెళ్ళవచ్చు. భారత్ లో వాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్న వారు ఆయా దేశాలకు వెళ్ళడానికి దారులు సుగమం చేయబడ్డాయి. ఇందుకు మోడీ తీసుకున్న చొరవ మరువలేనిది. రెండో కరోనా వేవ్ తో భారత్ కోలుకోడానికి కాస్త సమయం పట్టింది. అయినా త్వరగా మళ్ళీ అడుగులు వేయడానికి భారత్ ను మోడీ సంసిద్ధం చేయడంలో నిమగ్నులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలతో వాక్సినేషన్ పై ఉన్న అనేక సందేహాలను నివృత్తి చేస్తూ పోతున్నారు. విదేశీ యానాలకు భారతీయులకు ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నారు.

కొద్దిరోజుల నుండే దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీనితో ఆర్థికస్థితి మళ్ళీ గాడిలో పడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. దీనితో దేశీయంగా ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంబిస్తున్నాయి. దీనితో దేశీయ సూచీలు కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విదేశీ యానాలకు కూడా ఇతర దేశాలు అనుమతులు ఇస్తున్నాయి. దానితో విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలలో తమ భవితవ్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇలాంటి వారికి ముందు రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసి వారి ప్రయాణానికి సహకరించాలని ప్రభుత్వం ఆయా అధికారులను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: