జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో... వివాదాలు కొత్తేమీ కాదు.  ఇతర పార్టీల లీడర్ల తో కంటే సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో... ఈ వివాదాల గురించి... ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక వివాదం తెరపైకి తీసుకువచ్చి .. ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టి పోసుకుంటారు. అదేంటి సొంత పార్టీ నేతలే ఇలా తిట్టుకుంటున్నారు అని... ఇతర పార్టీల నేతలు అడిగితే... కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం అని డైలాగులు చెబుతారు. ఇక తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య వివాదం తెరపైకి వచ్చాయి. 

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి.. నిప్పులు చెరిగారు.   నిన్న జరిగిన బీఏసీ సమావేశం మరియు ఆ సమావేశం అనంతరం రేవంత్‌ రెడ్డి మండి పడ్డారు. పార్టీ బాగు కోసమే తాను మాట్లాడుతున్నానని...   రేవంత్ రెడ్డి ఒక్కడి తో అంతా అయిపోదని చురకలు అంటించారు.   రేవంత్‌ రెడ్డి... అందరినీ కలుపుకుని పోవాలని సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో  రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న  తీరు పై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు  ఎమ్మెల్యే జగ్గా రెడ్డి.

తాను మాట్లాడేది తప్పు అయితే... రేవంత్ రెడ్డి చేసేది కూడా తప్పేనని నిప్పులు చెరిగారు.   ప్రతీ సభ  లో రేవంత్‌ రెడ్డి అభిమానులు.. ఎవరిని మాట్లాడ నివ్వట్లేదని... ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.     '' జహీరాబాద్ వస్తె.. నాకు చెప్పావా..? నా వెనక సీనియర్ లు ఎవరు లేరు '' అంటూ మండిపడ్డారు.   సీనియర్లు ఎవరు మాట్లాడ టానికి ముందుకు రారని... రేపటి నుండి అసలు మాట్లాడనన్నారు జగ్గా రెడ్డి.  తాను చెప్పినవి మార్చుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కి మంచిదని .. లేకుంటే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు  ఎమ్మెల్యే జగ్గా రెడ్డి.  రేవంత్ రెడ్డి లేనప్పుడు పార్టీ అధికారం లోకి రాలేదా ..? అని ప్రశ్నించారు. అందరూ నేతలను కలుపుకుని పోతేనే....  కాంగ్రెస్‌ పార్టీకి లాభం చేకూరుతుందన్నారు ఎమ్మెల్యే జగ్గా రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: