అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి తాజా మోడీ అమెరికా టూర్ దోహదం చేస్తుందనేది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ గతంలో అమెరికా ప్రభుత్వం అధినేత ట్రంప్ కు చేసిన ప్రచారం కారణంగా ఇప్పటి పర్యటన చోటుచేసుకుంది. దీనివలన అప్పట్లో తాను చేసిన పొరపాటు దేశానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకూడదు అనే ముందుచూపుతో ఈ పర్యటన జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్యం, తీవ్రవాదాన్ని నిలువరించడానికి ఉమ్మడి కార్యాచరణ పై చర్చలు జరిగాయి. ఇవన్నీ జరిగితేనే ఆఫ్ఘన్ ఆక్రమణ వలన పేట్రేగిపోబోయే తీవ్రవాదాన్ని నిలువరించడానికి మరియు తిరిగి వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది.

ఏది ఏమైనా ఈసారి మోడీ అమెరికా పర్యటన గతంలో జరిగినట్టుగా లేకపోవటంతో ఆయా వర్గాలు ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగా లేవనే విమర్శలు చేస్తున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ప్రవాస భారతీయులను కలవటం కుదరలేదు, అలాగే ఇంతకూ ముందులా ఆలింగనాలూ తదితర చేయడం ఇప్పటి పరిస్థితులలో కుదరదు కాబట్టి కాస్త దూరం దూరంగానే అందరు ఉండి ఆయా సమావేశాలు జరపాల్సి వచ్చింది. ఈ మాత్రం సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా చేయొచ్చు కానీ గత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లి వాళ్ళను కలిసి ఆయా అంశాలపై చర్చించడంలో ఒక నమ్మకం బలపడే అవకాశం ఉంటుందనేది మోడీ ఆలోచన.

ఈ ఇరుదేశాల సంబంధబాంధవ్యాలు సరిగా ఉన్నా లేకున్నా ప్రస్తుత పరిస్థితులలో మాత్రం చైనాను, తీవ్రవాదం నిలువరించడం లాంటి అంశాలలో ఇద్దరి లక్ష్యం ఒక్కటే కాబట్టి కలిసి పనిచేయడం అవసరం. అందుకే బేదాభిప్రాయాలు ఎక్కడన్నా ఉన్నా కూడా పై రెండు అంశాల నేపథ్యంలో ఇరుదేశాలు కలిసి నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అమెరికా ఆధిపత్యం కోసం భారత దేశంతో చేసే వాణిజ్యం పై కాస్త నిబంధనలు పెట్టె అవకాశం ఉంటుంది. కానీ ఈ పర్యటన తో ఆ ప్రమాదం కూడా తప్పినట్టే చెబుతున్నారు నిపుణులు.  ఈ విధంగా  మోడీ ముందు జాగర్తగా ఆయా దేశాలతో సత్సంబంధాల కోసం కృషి చేస్తున్నారు. తాజా క్వాడ్ సభ్యత్వం కూడా అటువంటి ప్రయోజనాల కోసమే.

మరింత సమాచారం తెలుసుకోండి: