సాధారణం గా పెళ్లి అంటే ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ముందుగా వరుడు వధువు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. ఇక అన్ని లాంచనాలు గురించి మాట్లాడుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి బంధుమిత్రులందరికీ సమక్షంలో పెళ్లి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా పెళ్లి జరిగిన తర్వాత నూతన వధూవరులు శారీరకంగా కలిసేందుకు శోభనం అంటూ ఒక ప్రత్యేకమైన రోజును పిక్స్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఎవరైనా సరే పెళ్లి తర్వాత శోభనం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ పెళ్లికి ముందు శారీరక సంబంధం అనేదాన్ని మనదేశంలో చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు.



 ఇలా పెళ్లికి ముందే సెక్స్ అనేదాన్ని చాలామంది విష సంస్కృతి గా భావిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు సహజీవనం చేసుకోవచ్చు అంటూ అటు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ చాలామంది మాత్రం ఇలాంటి దాన్ని వ్యతిరేకించడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా పెద్దలే పెళ్లికి ముందు సెక్స్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. ఆశ్చర్యపోతున్నారు కదా.. కానీ ఇది అక్కడి ఆచారం.  అప్పుడప్పుడు కొన్ని తెగలకు చెందిన వింత ఆచారాలు తెర మీదికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఆచారమే ఇప్పుడు తెరమీదికి వచ్చింది. వీరి ఆచారం లో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ముందుగానే శృంగారంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు పెద్దలు.



 అయితే ఇది ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇలా పెద్దల అనుమతి తోనే పెళ్లి చేసుకోవాలనుకున్న నూతన వధూవరులు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటారు. అట మోరియా తెగ అనే ఆదివాసీలు పిల్లలకు నచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఇస్తారట. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ముందుగానే శృంగారం లో పాల్గొనేందుకు అనుమతి కూడా ఉంటుందట. ఇక పెళ్లికి ముందు పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులలో లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇక ఇలాంటి ఆచారం ఉంది అని అక్కడి తెగవారు చెబుతున్నారూ.  ఏదేమైనా ఇలాంటి ఆచారాలు మాత్రం నేటి రోజుల్లో యూత్ ను బాగా ఆకర్షిస్తాయి చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: