రాజకీయాలు అంటేనే దిగజారుడు తనం, కానీ అక్కడ కూడా కొంతమంది మరీ కిందిస్థాయికి వెళ్తున్నారు. అందులో ముందు ఉంది శివసేన. ఒకప్పటి బాలథాక్రే ఎక్కడ, ఇప్పుడు ఉన్న నేతలు ఎక్కడ. పెద్దలతోనే ఆయా పార్టీల విలువలు కూడా పోయినట్టేనా, చూడబోతే అలాగే ఉంది. తాజాగా బాలీవుడ్ డ్రగ్ కేసులో షారుక్ కొడుకు ను విడుదల చేసేందుకు భారీగా లంచం అడిగినట్టు వార్తలు వచ్చాయి. అవన్నీ ఎవరో అనవసరంగా సృష్టిస్తే, కనీసం అవి నిజామా కాదా అని విచారణ జరపకుండా ఇష్టానికి మీడియా రాసేయడం, దానికి శివసేన తందానా అనడం ఆ పార్టీ ఔన్నత్యాన్ని దిగజారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు అక్కడ షారుక్ కొడుకు తో సెల్ఫీ దిగిన వ్యక్తికీ అంతా అంటగట్టి మీడియా వార్తలు రాయడమే తప్పు, దానిని ఒక పార్టీకి చెందిన నేత ఇష్టానికి మద్దతుగా మాట్లాడం తప్పు. అధికారులు మాదకద్రవ్యాల పై ఉన్న చట్టాలను అనుసరించి అక్కడ నేరం ఎవరు చేసినప్పటికీ ఖైదు చేయడం వాళ్ళ విధి, అదే చేశారు. దానిని కూడా తప్పుబడితే మరి ఆ పార్టీకి కనీస రాజ్యాంగ విలువలు తెలుసు అనుకోవాలా లేదా అవన్నీ తెలియకుండానే పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. నోటికొచ్చినట్టు విమర్శలు చేసేందుకు అతీగతీ లేని వాళ్ళు కాదు కాస్తోకూస్తో చరిత్ర ఉన్న పార్టీ నేత, ఇలా మంచి చేడు తెలుసుకోకుండా విమర్శలు చేయడం ప్రజలలో తమను తాము కించపరుచుకోవడమే అవుతుంది.

రాజకీయాలలో అయితే విమర్శలు తప్పవు, కానీ అవి కాస్త అర్థవంతంగా ఉండాలి. శివసేన తరుపున కీలకమైన నేతలు వాంఖడే ను బెదిరిస్తున్నారు. ఆయన చేసిన పనిని చూసి అబినందించాల్సింది పోయి, ఆయనపై విచారణ చేపట్టమనడం ఏంటనేది అందరు ప్రశ్నిస్తున్న అంశం. అధికారులు చర్యలు తీసుకోవడంపై మీడియా, ఇలాంటి పార్టీలు చేసే యాగీ చుస్తే, సరిగ్గా విధులు కూడా నిర్వహించాలనే ఆసక్తి వాళ్లలో తగ్గిపోయే అవకాశాలు  ఉంటాయని, అది నేరాలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి దిగజారుడు పనులను ఆయా మీడియా, పార్టీలు మానుకుంటే నిజనిజాలు అధికారులు దర్యాప్తుల లో వెల్లడించే అవకాశాలు ఉంటాయని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: