ధర్మాన ప్రసాదరావు మొదలుకుని రెడ్డి శాంతి వరకూ అంతా ఇక్కడ ఆశావహులే! వచ్చే ఎన్నికల్లో తాను శ్రీకాకుళం ఎంపీగా పోటీచేస్తాను కనుక ఈ సారి మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వాలని రెడ్డి శాంతి కోరుతున్నారు. అయితే గతంలో ఓ సారి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామూపై పోటీ చేసి ఓడిపోయారు కనుక ఆమె పేరు మరోసారి పరిశీలించే అవకాశమే లేదని తేలిపోయింది. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యే అవకాశం ఉన్న వారు కూడా సీఎంను కలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రెడ్డి శాంతి సోదరుడు పాలవలస విక్రాంత్ కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు అని నిర్థారణ అయింది. ఇదే సమయంలో విశాఖ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్న వరుదు కల్యాణి (అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జ్) కూడా ఎమ్మెల్సీ అడుగుతున్నారు. ఈమెతో పాటు అదే ప్రాంతానికి చెందిన దాడి వీరభద్రరావు కూడా లైన్లోనే ఉన్నారు. ఇక మంత్రి పదవుల విషయానికే వస్తే ధర్మానతో పాటు సీతారాం కూడా ఇదే కోవలో ఇదే తోవలో ఉన్నారు. తనకు స్పీకర్ పదవి వద్దని మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు.
ఈయన కూడా ఇవాళ ముఖ్యమంత్రిని కలుసుకుని తన విన్నపం మరో సారి చెప్పే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎలానూ మత్స్య శాఖను చూస్తున్న జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పల్రాజును తప్పిస్తారు కనుక ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వీరి విషయమై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ కాకున్నా విశాఖలో ఆయనకు లీజర్ అవర్ ఉంది. అక్కడయినా ఈ ఉత్తరాంధ్ర నేతలంతా మోహరించే ఛాన్స్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి