అమెరికా ప్రపంచంలోనే పెద్దన్న.. ప్రపంచ రాజకీయాలను శాశించే పరిస్థితుల్లో ఉంది. ఇటీవల  కాస్త చైనా దూకుడు కారణంగా కాస్త ప్రభ తగ్గినా ఇంకా అమెరికాదే పై చేయి.. అందుకే ఇండియా కూడా అమెరికాతో దోస్తీకి ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలి కాలంలో అమెరికా కూడా ఇండియాకు ప్రయారిటీ ఇస్తోంది. ఈ రెండు దేశాల మైత్రి విన్ విన్ సిట్యుయేషన్‌గా ఉంది. అయితే.. కొన్ని విషయాల్లో మాత్రం అమెరికా వైఖరికి సైతం ఇండియా భిన్నంగా వెళ్లేందుకు వెనుకాడటం లేదు.


ప్రత్యేకించి మన దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో అమెరికా అభ్యంతరాలను సైతం ఇండియా ఖాతరు చేయడం లేదు. ఇండియా తన రక్షణ కోసం రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ఎస్‌ 400 ప్రత్యేకత ఏంటంటే.. ఇవి
శత్రు యుద్ధ విమానాలను, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేస్తాయి. ఇరువైపులా చైనా, పాక్ వంటి దేశాలు ఉన్న కారణంగా ఇవి మన భద్రతకు అత్యవసరం. అందుకే రష్యా నుంచి వీటిని కొనాలని ఇండియా నిర్ణయించింది. రష్యా కూడా ఈ క్షిపణులను ఇండియాకు అందించేందుకు ముందుకొచ్చింది.


ఈ ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు సరఫరా చేస్తోంది. అయితే.. ఈ క్షిపణులను రష్యా నుంచి భారత్ పొందడం పెద్దన్న అమెరికాకు మాత్రం అస్సలు ఇష్టం లేదట. అసలు రష్యా ఇండియాకు సరఫరా చేస్తే మధ్య అమెరికాకు ఏంటి నొప్పి అంటారా.. ఇలాంటి క్షిపణులను ఇతర దేశాల నుంచి ఏ దేశమైనా పొందితే ఆ దేశాలపై ఆంక్షలు విధించాలని గతంలో అమెరికా నిర్ణయించుకుంది. ఇప్పుడు ఇండియాకు కూడా అదే వర్తిస్తుంది.


రష్యా నుంచి భారత్ ఈ ఎస్‌ 400 క్షిపణులు కొనుగోలు చేస్తే తనపై ఇండియా ఆధారపడటం తగ్గుతుందని అమెరికాకు అనుమానం కూడా. అందుకే ఆంక్షల పేరుతో బెదిరిస్తోంది. కానీ.. భారత్ మాత్రం అమెరికా బెదిరింపులను ఖాతరు చేయడం లేదు. 39 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. రష్యా నుంచి ఈ రక్షణ వ్యవస్థను కొంటోంది. అసలే చైనాతో సరిహద్దు గొడవలు ఉన్న నేపథ్యంలో ఈ ఆధునిక రక్షణ వ్యవస్థ అత్యవసరం అని ఇండియా భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: