ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా నారాయణ సంగతి మనందరికీ విధితమే. 2014 నుంచి ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎదురు లేకుండా పోయింది. అయితే  దుబ్బాక ఉప ఎన్నిక నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కాస్త తడబడింది. అలాగే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ కి ఘోర పరాభవం ఎదురైందన్న ఈ విషయం మన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఓటమి అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. దీంతో మరోసారి తన సత్తా ఏంటో చూపించింది ఈ ఉద్యమ పార్టీ. అయితే... జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ చతికల పడింది అధికార టీఆర్ఎస్ పార్టీ.  అయితే ఇందులో విచిత్రమేంటంటే .. దుబ్బాక లో గెలిచిన రఘునందన్ రావు టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన నాయకుడు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలిచిన ఈటల రాజేందర్ కూడా టిఆర్ఎస్ పార్టీ బహిష్కృత నాయకుడే. అంటే బిజెపి పార్టీ సొంత అభ్యర్థి ఇప్పటి వరకు ఎక్కడా గెలవలేదు అన్నమాట. టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన నాయకులు మాత్రమే ఇతర పార్టీలో గెలవగలు తున్నారు. దీనిని మనం గ్రహించాల్సి ఉంటుంది. 

ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఎప్పటి నుంచి సంప్రదాయంగా వస్తున్న లెక్కల ప్రకారం పట్టణాల్లో బిజెపి పార్టీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో వాసులు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు గతంలో అంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ రేంజ్ లో గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే బిజెపి పార్టీ కొత్తగా సాధించింది ఏమీ లేదన్న మాట. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే శక్తి బిజెపి పార్టీకి ఉందని ఖచ్చితంగా చెప్పలేము. అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అసలు.. ఆ పార్టీలో ఎవరూ ఎప్పుడూ గొడవ పడతారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ఆ పార్టీలో గెలిచినా మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా చాలా గట్టిగా ఉంది.

ఇలాంటి తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 60 లక్షల పార్టీ సభ్యత్వం ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఢీ కునేందుకు బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు మరింత బలంగా కావాలని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే టిఆర్ఎస్ ను ఢీ కొట్టే ఛాన్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉంది. తొందరగా ప్రజల్లోకి  వెళ్ళ కలుగుతుంది. ఇక బీజేపీ పరిస్థితి మాత్రం పూర్తిగా విభిన్నం. ఉత్తర తెలంగాణలో తప్ప దక్షిణ తెలంగాణలో ఎక్కడ రాలేదు బిజెపి పార్టీ. బలంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామస్థాయిలో సరిగా ఉంచుకోలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ముందున్న పెద్ద సవాల్. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుని టిఆర్ఎస్ ను ఢీ కొట్టాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: