ఏపికి పొంచి ఉన్న మరో వానగండం. మళ్ళీ వరుణ దేవుడు కన్నెర్ర చేయనున్నాడు అంటూ వార్తలు వెలువడుతున్నాయి. నేటి నుండి మరో మూడు రోజుల వరకు మళ్ళీ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి లాగే మళ్ళీ అదే స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నేడు నైరుతి బంగాళాఖాతం మరియు అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఇది భారీ వర్షాల సూచన అని తెలిపింది. ఉరుములతో కూడిన తుఫానుగా ఇది మారే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. పెనుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మళ్ళీ ఆ పవనాలు పశ్చిమ వాయువ్య దిశ వైపు ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరం వైపుకు మరలే అవకాశం ఉందని తెలిపింది. కావున ఉరుములు మెరుపులతో, పెను గాలులతో ఏకధాటిగా భారీ వర్షాలు ఏపిని తాకే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఈ సారి మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ. కావున లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుని మొన్న జరిగినట్లు కాకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే గత వారంలో పడిన వర్షాలకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఎందరో ఆవాసాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. దాని నుండి ఇంకా కోలుకోక ముందే మళ్ళీ ఇంకొక తుపాన్ అన్న వార్తలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి వరుణ దేవుడు కరుణించేనా అన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: