రాజ‌కీయాల‌లో భాష
దిగజారుతోంది అని బాధ‌ప‌డ‌డం
ఓ విడ్డూరం
కేసీఆర్ భాష (సాక్షాత్తూ గౌర‌వ ముఖ్య‌మంత్రి)  
రేవంత్ భాష ( గౌర‌వ టీపీసీసీ చీఫ్‌)
బండి భాష (గౌర‌వ ఎంపీ)
అర‌వింద్ భాష (గౌర‌వ ఎంపీ)
ఈ విధంగా మ‌నిషికో భాష మ‌నిషిదో భావం
వికృతంగా వినిపిస్తే తిట్ల రూపానే వినిపిస్తూ ఉంటే
ఓ విడ్డూరం
అదే రాజ‌కీయం అని స‌ర్దుకుపోండి


తిట్ట‌డం ఫ్యాష‌న్ త‌న్న‌డం కూడా ఫ్యాష‌న్ అని ఓ సినిమాలో చెప్పారులేండి..అదేలే..వ‌యొలెన్స్ ఇట్స్ ఎ ఫ్యాష‌న్ అని అంటారు క దా అదే ఇది! మ‌రి తిట్టి ఏం సాధించాలి. తిట్టి అధికారం సాధించాలి. పొగిడి ఏం సాధిస్తారో కానీ తిట్టి మాత్రం మ‌న నాయ‌కులు ఆత్మ తృప్తి పొంది ఉంటారు. అలాంటి ఆత్మ తృప్తి ద‌గ్గ‌ర అంతా ఒక్క‌టే అనే అనుకోవాలి మ‌న రాజ‌కీయ నాయ‌కుల విష‌య‌మై. ఎందుకం టే ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించే క్ర‌మంలో ఎవ‌రిని ఎవ‌రైనా తిట్టేయొచ్చు. అందుకు నీ మ‌రియు నా అన్న భేదం ఉండ‌దు. ఆ క్ర‌మంలో ఏం చేసినా చెల్లుతుంది. క్రేజ్ కోసం కొన్ని బూతులు తిట్టేయొచ్చు.
మీడియా కోసం కూడా కొన్ని బూతులు తిట్టేయొచ్చు. ఏం కాదు. ఏం చేసినా ఆత్మ తృప్తి ప‌ర నింద అన్న‌వి చాలా చాలా గొప్ప‌వి అని మ‌న పెద్ద‌లు చెప్పారు క‌దా! ఆ మాట ను మాత్రం మన నాయ‌కులు త‌ప్ప‌క పాటిస్తారు. అలా చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నా ప‌ర్లేదు కానీ చేయాల్సిందంతా చేసి బాధ‌ప‌డ‌డం అన్న‌ది మాత్రం చేయ‌రు. మ‌న నాయ‌కుల తిట్ల‌లో లోకం ఏమ‌నుకుంటుందో అన్న బాధ ఉండ‌దు. త‌మ వారు ఏమ‌నుకుంటున్నారో అన్న బాధ అస్స‌లు ఉండ‌దు. ఎవ‌రిని ఉద్దేశించి ఎందుకు తిడుతున్నామో అన్న క‌నీస స్పృహ ఉండ‌దు. అందుకే మ‌న నాయ‌కులు ఏం తిట్టినా మీడియా ప‌ట్టించుకున్నంత‌గా సామాన్యులు ప‌ట్టించుకోరు. అస‌లు వారికి ప‌ట్టించుకునే తీరిక కానీ ఓపిక కానీ ఉంటాయి అని కూడా అనుకోకూడ‌దు.

ఇక తెలంగాణ రాజ‌కీయాల్లో విప‌రీతంగా తిట్టే నాయ‌కుల‌కు లోటే లేదు. ఉద్య‌మ కాలంలోనూ త‌రువాత కేసీఆర్ తిట్లు వెరీ ఫేమ‌స్ కూడా! ఆయ‌న ప్ర‌సంగంలో తెలంగాణ జాతీయాలు, వాటి సొబ‌గులు ఎలా విన‌ప‌డ‌తాయో అదేవిధంగా ఆయ‌న రాయ‌కూడ‌ని భా ష‌లో తిట్లే తిట్లు కూడా అదే రీతిన విన‌ప‌డ‌కుండా ఉండ‌వు. ఇదే కోవలో కొంత కాలం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ నోరుకు అడ్డూ అదుపూ అన్న‌దే లేకుండా పోయింది. ఇదే రీతిలో కొంత‌కాలం సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అయిన మోత్కుప‌ల్లి కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటే ఎంద‌రెంద‌రో! తిట్ల‌తోనే ఫేమ‌స్ అయి మీడియాలో నిలిచారు. ఆ విధంగా వారు కోరి క‌య్యం ఆడి వివాదాస్ప‌దుల‌య్యారు. అయినా ఈ తిట్ల కార‌ణంగా జ‌నంలో ఏమ‌యినా గుర్తింపు వ‌స్తుందా లేదా క‌నీసం వీళ్లు తోటి వారిని గౌర‌వించ‌నైనా గౌర‌వించ‌రు అన్న చుల‌క‌న భావం ఒక‌టి స్థిర‌ప‌డిపోతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: