ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ఎన్నో చిన్న పార్టీలతో జట్టుకట్టి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంతో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడం అంటే అసాధ్యం. అందుకే మనకు సుస్థిర, అస్థిర ప్రభుత్వాలు అని ఉంటాయి. గొప్పగొప్ప నిర్ణయాలు తీసుకోవాలి అంటే సుస్థిర ప్రభుత్వాల వలననే అవుతుంది. అవే త్వరగా నిర్ణయాలు తీసుకోగలవు, అమలు చేయగలవు. ఎవరో ఏదో అనుకుంటారేమో, అక్కడ పలానా అభివృద్ధి కార్యక్రమం చేస్తే మంచిదేనా, చేయొచ్చా ఇలా ఆలోచిస్తూనే చాలా సార్లు సమయం గడిచిపోతుంది. కానీ ప్రభుత్వం సుస్తిరమైనది ఉంటె అలాంటి నిర్ణయాలు అన్ని ఆలోచనతో ప్రారంభం అవడమే కాకుండా అమలు కూడా అయిపోతాయి.

అలాంటి ప్రభుత్వాలు దేశం ఏర్పాటు చేయబడ్డాక చాలా తక్కువ. అందులో తాజా బీజేపీ మాత్రమే అలాంటి సుస్థిర ప్రభుత్వంగా అనేక నిర్ణయాలు తీసుకోగలిగింది. పెద్ద నోట్ల రద్దు కావచ్చు, సరిహద్దులలో గస్తీ పెంచడం కావచ్చు, ప్రపంచానికి వచ్చిన కష్టకాలంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ చాలా సున్నితమైన సందర్భాలు, వాటిలో ఆలోచిస్తూ కాలం గడిపేస్తే ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ బీజేపీ సుస్థిర ప్రభుత్వం కాబట్టి అవన్నీ సునాయాసంగా తీసుకోగలిగింది, అమలు కూడా చేయగలుగుతుంది. గతంలో ఎన్నడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు లేవు. 1992 నుండి అన్ని ప్రభుత్వాలు అస్థిర ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. వాటి నిర్ణయాలు సరిలేవు, ప్రభుత్వం చేసింది లేదు అన్నట్టే అభివృద్ధి కూడా ఉంది. అంతకు ముందు సుస్థిర ప్రభుత్వాలు వరుసగా ఉండేవి. ప్రస్తుతం మళ్ళీ ఇప్పటికి బీజేపీ సుస్థిర ప్రభుత్వంగా ఏర్పాటు అయ్యింది. అయినా కూటమిగానే నడుస్తుంది.

ఒకప్పటి సుస్థిర ప్రభుత్వ పాలన ఇప్పటి అస్థిర ప్రభుత్వ పాలన మహారాష్ట్ర విషయంలో పోల్చి చూసుకుంటే పరిస్థితి అర్ధం అవుతుంది.  ఇప్పటి ప్రభుత్వంలో అక్కడ పూర్తి మెజారిటీ ఏ పార్టీకి లేదు. అందుకే ఒక నిర్ణయం స్పష్టంగా తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల సమస్య, మాదకద్రవ్యాల సమస్య, వ్యాపారస్తులకు రక్షణ లేకపోవడం లాంటివి వెంటాడుతున్నాయి. దీనితో వ్యాపారస్తులు వేరే దారి చూసుకుంటున్నారు. అస్థిర ప్రభుత్వాలు ఉన్న చోట పరిస్థితి ఇలాగె ఉంటుంది. ఇక గుజరాత్ లో సుస్థిర ప్రభుత్వం ఉన్న చోట పరిస్థితి గురించి చుస్తే, అక్కడ కేవలం ఎనిమిది ఏళ్లలో 2012-20 లో మహారాష్ట్రను దాటి నెంబర్ వన్ వ్యాపార హబ్ గా మారిపోయింది. మహారాష్ట్ర జి.ఏ.వి సూచి 4.53 లక్షల కోట్లు అయితే గుజరాత్ ది 5.11 లక్షల కోట్లుగా ఉంది. సుస్థిర ప్రభుత్వం ఉంటె అభివృద్ధి అలా పరుగులు పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: