జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీని ముందుకు నడిపించడానికి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడం ఆ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం కూడా నచ్చని అంశం గా చెప్పాలి. పార్టీలో చాలామంది నాయకులు ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ వల్ల సైలెంట్ గా ఉంటుందనే విషయం చాలామంది జనసేన పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ వ్యవహారాల మీద చాలా మంది జనసేన పార్టీ నాయకులు పట్టు కోల్పోవడమే కాకుండా ప్రజా ఉద్యమాలు నిర్వహించే విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేక పోవడం వంటివి ప్రధాన సమస్యగా మారుతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రావడానికి కాస్త ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కారణంగా తన ఇమేజ్ కూడా పడిపోతుంది అనే భావనలో ఆయన ఎక్కువగా ఉన్నారని ప్రధానంగా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న సరే తాను ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయని దానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అని ఆవేదన పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా ఉందని అంటున్నారు. రాజకీయంగా పార్టీని బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా క్లియర్ గా అర్థమైంది సరే పవన్ కళ్యాణ్ దాన్ని అనుకూలంగా మార్చుకునే లేకపోతున్నారు.

దీనివల్ల పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఇతర పార్టీల వైపు చూడటం కొంతమంది పార్టీ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో పార్టీ జండా మోయడానికి కూడా ఇష్టపడకపోవడం, అభిమానులు కార్యకర్తలు లేకపోవడం వంటివి పవన్ కళ్యాణ్ బాగా ఇబ్బంది పడుతున్న అంశాలుగా చెప్పవచ్చు. చాలామంది జనసేన పార్టీ నాయకులు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ వైపు అధికార పార్టీ వైపు చూడటం కానీ పవన్ కళ్యాణ్ ని ఆయన కోసం ముందుకు రావడం లేదని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: