తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు స్టేట్‌మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ వారి మాటలకు తగ్గట్టుగా చేతలు మాత్రం ఉండటం లేదనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్‌కు రూట్ లెవెల్‌లో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. అది టీఆర్ఎస్‌కు సొంతంగా ఏర్పడిన క్యాడర్ కాదనే చెప్పాలి. ఎక్కువ శాతం టీడీపీ క్యాడర్‌ని టీఆర్ఎస్ లాగేసుకుంది. ఎందుకంటే 2014 ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పూర్తి స్థాయిలో బలం లేదు. ఎప్పుడైతే టీడీపీని పూర్తిగా లాగేసిందో...అప్పటి నుంచి టీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో బలపడింది. టీడీపీ నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల వల్ల టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ పెరిగింది.

ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీకి ప్లస్ అయింది. ఇలా టీఆర్ఎస్ బలం పెంచుకుంది. అలా బలంగా ఉన్న టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే అంత సులువైన పని కాదు...టీఆర్ఎస్‌కు తగ్గట్టుగానే బలమైన క్యాడర్ వేరే పార్టీలకు ఉండాలి. అలా కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉంది...గానీ ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత బీజేపీకి కలిసొస్తుంది.

కాకపోతే బీజేపీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే...క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తలు లేకపోవడం. దాని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఢీకొట్టాలంటే బీజేపీకి అంత సులువు కాదు. ఇప్పటినుంచే రూట్ లెవెల్‌లో బీజేపీ బలపడాలి. అందుకు తగ్గట్టుగా బీజేపీ నాయకత్వం పనిచేయాలి.

బలమైన నాయకులని పార్టీలోకి తీసుకుంటే...క్యాడర్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ ఆ దిశగా బీజేపీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అసలు ఈటల రాజేందర్ లాంటి నాయకులు పార్టీలోకి వస్తే....ఆయన్ని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఆయన ద్వారా...టీఆర్ఎస్‌లోని కీలక నాయకులని బీజేపీలోకి తీసుకురావొచ్చు...కానీ బీజేపీ మాత్రం ఆ పనిచేయడం లేదు. ఇలాగే ముందుకెళితే కేసీఆర్‌కు చెక్ పెట్టడం కష్టమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp