అలాంటి బ్యాంకింగ్ రంగంలో బోలెడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వమే చెప్పింది. అది కూడా ఏకంగా పార్లమెంటులో.. అవును.. నిజమే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఖాళీగా ఉన్న పోస్టులు.. అసలు మొత్తం బ్యాంకుల్లోని మొత్తం పోస్టుల్లో ఇది 5శాతంగా అంచనా వేస్తున్నారు. అసలు ఇండియా మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయి.
ఒక్క భారతీయ స్టేట్ బ్యాంకు అంటే ఎస్‌బీఐలోనే 8 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం వల్ల.. ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోతోందట. ఈ అంశంపై లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఇందులో ఆఫీసర్, క్లర్క్, సబ్‌స్టాఫ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయట.
ఇక బ్యాంకుల వారీగా వస్తే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 6,700 ఖాళీలు ఉన్నాయట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,200 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 5,100.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,800 ఉన్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంటులోనే తెలిపారు. మరి ఇంకేం.. మీకు ఏమాత్రం ఆసక్తి ఉన్నా బ్యాంకింగ్ పరీక్షలపై దృష్టి పెట్టి బ్యాంకు ఉద్యోగం సాధించండి.. మీ సత్తా సగౌరవంగా చాటండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి