రాజకీయాల్లో సొంతంగా సత్తా చాటే బలం లేకపోయినా...ఒకోసారి ప్రత్యర్ధి పార్టీలు చేసే తప్పులు కూడా మరొక పార్టీకి కలిసొస్తుంది. అలా గత ఎన్నికల్లో టీడీపీ చేసిన తప్పిదాలు...వైసీపీకి బాగా కలిసొచ్చాయి. అంటే వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా బలం లేకపోయినా సరే...టీడీపీ తప్పిదాలు బాగా కలిసొచ్చాయి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా కొన్ని తప్పిదాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది.

కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల రాజకీయం మొత్తం మారిపోయి ప్రత్యర్ధి నేతలకు బాగా కలిసొస్తుంది..ఇటీవల దర్శి నియోజకవర్గంలో వైసీపీకి ఎలాంటి పరిస్తితి వచ్చిందో అందరికీ తెలిసిందే. అక్కడ వైసీపీలో ఉన్న ఆధిపత్య పోరు టీడీపీకి బాగా కలిసొచ్చి..దర్శి మున్సిపాలిటీని గెలిచేసుకుంది. ఇలా పలు నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్న లుకలుకలు టీడీపీకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి.

ఇదే క్రమంలో కర్నూలు సిటీలో కూడా వైసీపీలో పోరు..టీడీపీకి ప్లస్ అయ్యేలా ఉంది. మామూలుగా కర్నూలు టౌన్ ముందు నుంచి టీడీపీకి కలిసిరాదు. ఇక్కడ ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది...ఆ తర్వాత వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు...అలాగే ఎస్సీ, రెడ్డి వర్గం ఓట్లు కూడా ఎక్కువ. దీని బట్టే చెప్పొచ్చు...ఇక్కడ ఎందుకు టీడీపీకి పట్టు ఉండదు...వైసీపీ హవా ఎందుకు నడుస్తుందో. అయితే ఇలా పట్టున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల...పట్టు కోల్పోయేలా ఉంది.

నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే...మరోక నేత వర్గం సహకరించే పరిస్తితి లేదు. అంటే వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. వైసీపీలో ఉన్న లుకలుకలని కరెక్ట్‌గా ఉపయోగించుకుని, ఇంకా ముస్లిం, ఎస్సీ ఓటర్లని కొంతవరకు తనవైపు తిప్పుకుంటే టీడీపీ నేత భరత్‌కు తిరుగుండదు. ఇటు సొంత వర్గం ఆర్యవైశ్య ఓటర్ల సపోర్ట్ ఎలాగో ఉంటుంది...కాబట్టి కాస్త కష్టపడితే...భరత్‌కు లక్కీ ఛాన్స్ ఉంటుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: