భూమి నుంచి వచ్చే బంగారం అంతా
అదే ఎర్రచందనం అంతా రెండు గుడ్డి దీపాల మధ్య
దారి మళ్లిపోతుంది.. ఆ గుడ్డి దీపాల వెలుగుకు
నియంత్రిత శక్తి ఒకటి ఒనర్ షిప్ చేస్తుంది..
ఒక క్యారెక్టర్ సినిమా లైఫ్ ను మారుస్తుంది. ఊహాతీత విజయాలను అందించి వెళ్తుంది. అందుకే ఏ కథకు అయినా లీడ్ రోల్ ను డిజైన్ చేయడమే చాలా ఇంపార్టెంట్. హీరోయిజం ఎలివేషన్ అన్నది ఇంకా ముఖ్యం. ఈ రెండూ జాగ్రత్తగా నడిపితేనే మిగతా సినిమాలోని పాత్రలు వాటి నడవడి అన్నవి ఆధారపడి ఉంటాయి. అందుకే ఏ కథలో అయినా అతి ముఖ్యం అనుకునే పాత్రకు కొన్ని లక్షణాలు నిర్దేశించే రాస్తారు. సుక్కూ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ సినిమాలు తీస్తూ వస్తున్నారు. అవి మంచివా, చెడువా అని కాదు ఓ పాత్ర గమనం సమాజ రీతికి అనుగుణంగా ఎలా ఉంటుంది. ఆ తరువాత ఆ పాత్ర మార్పు చెందే విధానం ఏమయినా ఉంటుందా లేదా అలానే సమాజం అతడిని ఉండనిస్తుందా ఇలాంటివెన్నో దృష్టిలో ఉంచుకుని ఆయన సినిమాలు రూపొందుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి