రాజేశ్ అనే కార్మికుడు ఒడిశా నుంచి వచ్చి బాచుపల్లిలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. బుధవారం రాత్రి బిరియానీ తిందామని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. అయితే అక్కడ సెల్లార్‌లో రెస్టారెంట్ సిబ్బంది కొందరు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. రాజేశ్ ను అతడిని చూసి రెస్టారెంట్ సిబ్బంది దొంగగా భావించారు. ఏవో ప్రశ్నలు అడిగారు.. రాజేశ్ వైఖరిపై అనుమానం వచ్చిన రెస్టారెంట్ సిబ్బంది సెల్లార్‌లో దారుణంగా కొట్టేశారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఒడిశా కార్మికుడు రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
రాజేశ్‌ను దారుణంగా కొట్టిన సిబ్బంది కనీసం చనిపోయాడా.. బతికాడా అన్న విషయం కూడా పట్టించుకోలేదు. రాత్రంతా గాయాలతోనే అల్లాడిన రాజేశ్ గురించి ఉదయం అతని భార్యకు కొందరు సమాచారం ఇచ్చారు. లబోదిబోమంటూ వచ్చిన అతని భార్య.. చేతిలో సొమ్ములు లేకపోవడంతో అతన్ని కనీసం ఆసుపత్రి కూడా తీసుకెళ్లలేకపోయింది. అలాగే ఇంటికి తీసుకెళ్లింది. మొన్న ఉదయం గాయాలతో రాజేశ్ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భావించిన రాజేశ్ భార్యకు అక్కడా తిప్పలు తప్పలేదు.
రాజేశ్ భార్య మొదట మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు అది తమ పరిధి కాదంటూ కేపీహెచ్‌బీ ఠాణాకు వెళ్లాలని చెప్పారు. మృతుడు రాజేశ్ భార్య ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి