రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు ఎలానూ సాధ్యం కాదు క‌నుక జ‌గ‌న్ స‌ర్కారు కొత్త ప‌ద్ధ‌తి ఒక‌టి తెర‌పైకి తెచ్చింది. ధ‌ర‌లు త‌గ్గించి అమ్మ‌కాలు పెంచుకుని త‌ద్వారా ఆదాయం పెంచుకుని సేఫ్ జోన్ లో ఉండేందుక ఉవ్విళ్లూరుతోంది. దీంతో ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మకాల‌పై వ‌స్తున్న ఆదాయాన్ని ఆధారంగా చూపించి కొత్త అప్పులు కూడా తెచ్చుకోవ‌చ్చ‌న్న ఆలోచ‌న కూడా జ‌గ‌న్ వ‌ర్గాల‌కు ఉంద‌ని తెలుస్తోంద‌ని టీడీపీ అంటోంది.


మందు రేట్లు త‌గ్గించారు ఏపీ  స‌ర్కారు నిర్వాహ‌కులు. దీంతో ఎక్క‌డ చూసినా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ద్య పాన నిషేధం అమ‌లు చేస్తాన‌ని చెప్పి, జ‌గ‌న్ ఈ విధంగా మ‌ద్యం రేట్లు త‌గ్గించ‌డం ఎంత మాత్రం భావ్యం కాద‌నే అంటున్నారు ఇంకొంద‌రు. మ‌ద్యం అమ్మ‌కాలు పెరుగుద‌ల ద్వారా ఆదాయాల‌ను ఆర్జించాల‌ని అనుకుంటున్న జ‌గ‌న్ ఏ విధంగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంలో భాగంగా చాలా చోట్ల ఆనందోత్సాహాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని తెలుస్తోంది. మందుబాబులు ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నారు.180 ఎంఎల్ విస్కీ ధ‌ర‌ను 150 నుంచి 120కి త‌గ్గించారు. అదేవిధంగా స్కాచ్ ధ‌ర 660 ఉండ‌గా 590 రూపాయ‌ల‌కు త‌గ్గించారు. ఇలా అన్నింటి ధ‌ర‌లూ  తగ్గిస్తూ మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోత్స‌హించేందుకు త‌ద్వారా ఆర్థిక లావాదేవీల‌ను పెంపొందింకునేందుకు వైసీపీ స‌ర్కారు వేసిన ప్ర‌ణాళిక చాలా చోట్ల మంచి ఫ‌లితాల‌నే అందుకోనుంది.



ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశం జిల్లా సింగ‌రాయి కొండ‌లో మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో ఏకంగా మందుబాబులు షాపుల ద‌గ్గ‌ర పూజ‌లు చేసి ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డంతో ఆ వార్త కాస్త వైర‌ల్ అయింది. మ‌ద్యం షాపున‌కు హార‌తులు ఇచ్చారు. పాట‌లు పాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఇన్నాళ్లూ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ధ‌ర‌లు నింగిని తాకేలా ఉన్నాయ‌ని, ఇన్నాళ్ల‌కు త‌మ ప‌రిస్థితి అర్థం చేసుకుని రేట్లు త‌గ్గించ‌డం ఎంతైనా ఆనంద‌దాయ‌క‌మ‌ని వారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: