మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టం.. ఇక నోరూరించే మామిడి పండ్లు తింటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగా చెట్టు పై నుంచి మామిడి పండ్లు కోయాలి అంటే చెట్టు ఎక్కి ఇక కోయడానికి ఎంతో కష్టపడాలి. కానీ ఏకంగా హాయిగా మంచం మీద మామిడి పండ్లు కోసుకుని తింటే ఎలా ఉంటుంది. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇలాంటివి కేవలం కలలో మాత్రమే సాధ్యమవుతాయి అని సమాధానం చెబుతారు ఇలా అడిగితే ఎవరైనా. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన పనిలేదు. కలలో కాదు నిజజీవితంలో కూడా ఇలా మంచంపై పడుకొని హాయిగా మామిడిపండ్లు కోసుకొని తినవచ్చు. అదెలా సాధ్యమవుతుంది అని అనిపిస్తుంది కదా..


 అయితే ఇక్కడ మనం చెప్పబోయే ఇల్లు చూస్తే మాత్రం అవును అది సాధ్యమయ్యే పనే అని అనిపిస్తూ ఉంటుంది.  అజ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త  ప్రదీప్ సింగ్ వినూత్న ఆలోచన చేశాడు.. భూమి మీద కాదు ఏకంగా మామిడి చెట్టు పై ఇల్లు కట్టుకున్నాడు . ఉదయపూర్ లోని ఈ మామిడి చెట్టు ఇల్లు లో రెండు బెడ్రూంలు ఒక కిచెన్ ఒక హాల్ అన్నీ ఉన్నాయి. అయితే ఇతనికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా చెట్లను నరకడం అస్సలు నచ్చదు. అయితే ఈ క్రమంలోనే ఉదయపూర్ లో ఒక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక మామిడి చెట్టు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ మామిడి చెట్టు ను అక్కడి నుంచి వేర్లతో సహా తీసి వేరే దగ్గర నాటడానికి ఎవరూ ముందుకు రాలేదు.


 దీంతో దీనిని ఎంతో ఛాలెంజింగ్గా తీసుకున్నాడు సదరు వ్యక్తి. దాదాపు ఏడాది పాటు కష్టపడి ఇక ఆ మామిడి చెట్టు పైన ఇంటిని నిర్మించుకున్నాడు. మామిడి చెట్టు కాండాన్ని బేస్ గా చేసుకున్నాడు. మొత్తం ఉక్కుతో నిర్మాణం చేపట్టాడు. ఇలా తొమ్మిది అడుగుల ఎత్తులో ఇంటి నిర్మాణాన్ని మామిడి చెట్టు పై చేసుకున్నాడు. అయితే మొదట్లో 20 అడుగులు ఉన్న ఈ మామిడిచెట్టు 11 ఏళ్లలో 40 అడుగుల పెరిగింది  దీంతో ప్రదీప్ సింగింగ్ ఇల్లు కూడా మూడు అంతస్తులు పెరిగింది. ఇక ఇందులో తన భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాను అంటూ చెబుతున్నాడు. వారు ప్రకృతి జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు అంటూ ప్రదీప్ సింగ్ చెప్పుకొస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: