ఏపీలో ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా ఆదివారం వైసీపీ మంత్రి కొడాలి నాని తోపాటు గన్నవరం టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లతో కలిసి తిరిగారు. అక్కడితో ఆగకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబు లోకేష్ తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వల్లభనేని వంశీ ఘోరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చివరికి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే వరకు వెళ్లాయి. చంద్ర‌బాబు తాను తిరిగి ముఖ్య‌మంత్రిని అయ్యే వ‌ర‌కు అసెంబ్లీలో కూడా అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశారు.

వంశీ వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడ‌ర్ ర‌గిలి పోయింది. అలాంటి వ‌ల్ల‌భ‌నేని వంశీతో వంగ‌వీటి రాధా అంట కాగ‌డాన్ని టీడీపీ అధిష్టానం తో పాటు ఆ పార్టీ నేత‌లు ఎంత మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. అలాగే చంద్ర‌బాబు, లోకే ష్ ల‌ను తీవ్రంగా విమ‌ర్శించే మంత్రి కొడాలి నానితో వంగ‌వీటి రాధా చెట్టా ప‌ట్టాలే సుకుని తిర‌గ‌డం కూడా పార్టీ కేడ‌ర్ కు రుచించ‌డం లేదు.

ఇప్పుడు వంగవీటి వైసీపీ మంత్రి తో పాటు టీడీపీ గెలిచి వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యే తో క్లోజ్ గా ఉండ‌డంతో టీడీపీ లో చాలా అనుమానాలు వస్తున్నాయి. రాధా ఇలా చేయ‌డం ఏ మాత్రం బాగోలేద‌ని.. ఆయ‌న‌కు టీడీపీ లో ఉండ‌డం ఇష్టం లేక‌పోతే పార్టీ నుంచి వెళ్లిపోవ‌చ్చ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

అయితే పార్టీ లోనే ఉంటూ.. పార్టీ కేడ‌ర్ మ‌నోధైర్యం దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తే బాగుండ‌ద‌ని చెపుతున్నారు. మ‌రి రాధాను పార్టీ అధిష్టానం దీనిపై ఏదైనా వివ‌ర‌ణ కోరుతుందేమో ?   దీనిపై ఆయ‌న ఎలా స్పందిస్తా రో ?  చూడా లి.

మరింత సమాచారం తెలుసుకోండి: