తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ తెలిపింది. 31 అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరుచుకొని ఉండనున్నాయి. బార్లు, ఈవెంట్లకు రాత్రి 1:00  వరకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక అనుమతినిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మద్యం షాపుల తో సహా బార్లు, ఈవెంట్లు,రెస్టారెంట్లు అర్ధ రాత్రి వరకు తెరిచి ఉంచుకునే అనుమతులు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఉంటుందని తెలంగాణ సర్కారు  పేర్కొంది.

 ఏదేమైనప్పటికీ అర్ధ రాత్రి వరకు వైన్స్ ఓపెన్ ఉంటాయని చెప్పి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే డిసెంబర్ 31 అంటే ఆ రోజు హడావిడి  గట్టిగా ఉంటుంది. ఓమిక్రాన్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశనం చేస్తూనే, ఈ సడలింపులు కొన్ని చేసిందని చెప్పుకోవాలి. బార్లు,పబ్బులు, రెస్టారెంట్ లు ఓపెన్ ఉంటాయా లేవా అని అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది. మేము న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవచ్చా లేదా అనే అయోమయంలో ఉండి, ప్రభుత్వం  చెప్పే నిర్ణయం కోసం వేచి చూశారు.

దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో డాక్టర్లు కూడా సూచిస్తుంది ఒకటే. ఈ సమయంలో ఎంజాయ్మెంట్ ముఖ్యం అనుకుంటే గనుక దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే  ఎంజాయ్మెంట్ కన్నా ప్రాణం ముఖ్యమని డాక్టర్లు  చెబుతున్నారు. ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తోంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందనే ఉత్కంఠ మాత్రం ప్రజల్లో  కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: