ముఖ్యంగా మరొకసారి మాఫియాలపై సంచలన కామెంట్స్ చేసారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఏపీలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది కానీ.. తగ్గాల్సింది ఏదైనా ఉందంటే.. అది లోకల్ మాఫియానే అని పేర్కొన్నారు. మాఫియాలో కేవలం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలోనే కాదు.. గత ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నాయి అని.. ఈ మాఫియాలలో పోలీస్ శాఖ వాళ్లూ కూడా ఇన్వాల్ అయ్యారని అన్నారు. ప్రజల్లో పోలీసులపై న్యాయం చేస్తారు అనే నమ్మకం, భరోసా ఉన్నప్పటికీ.. పోలీసులే మాఫియాతో కలిస్తే.. దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రతనే ఉండదని పేర్కొన్నారు.
అదేవిధంగా వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. కలుపు మొక్కలను తీసివేయాలని సంలచన వ్యాఖ్యలు చేసారు. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఇటీవల ఏపీలో ఎంపీటీ ఎన్నికల్లో నల్లపురెడ్డి సొంత మండలంలో ఎంపీటీసీ స్థానాలు కోల్పోవడంతో.. కోటా పంచాయతీలో ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు లేనిదే చేయడం లేదు అని నల్లపురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెనింగ్‌కు పిలుస్తే డబ్బులు డిమాండ్ చేస్తారా..? ఇందేంటి అని సొంత పార్టీ నేతలనే నిలదీసారు నల్లపురెడ్డి. వైసీపీ నేతల వల్ల నా కుటుంబం పరువు పోయిందని, సొంత మనుషులు ఇతర పార్టీలోకి.. వర్గాల్లోకి వెళ్లడంతో.. మా ఉనికినీ కోల్పోవడం కన్నీళ్లు వస్తున్నాయన్నారు. జగనన్న ఇండ్ల విషయంలో ప్రసన్నకుమార్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కడం గమనార్హం.
ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లలో బెడ్‌రూంలు చిన్నవిగా ఉన్నాయని.. అందులో కాస్త పెద్ద సైజు ఉన్న మంచం వేసే పట్టే పరిస్థితి లేదు అని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రెడిమేడ్ మంచాలేవీ ఈ బెడ్ రూంలలో పట్టవు అని, గదికి తగ్గట్టు కొలతలు తీసుకొని మంచం తయారు చేయాలని పేర్కొన్నారు. బెడ్‌రూం 24 గజాల్లో నిర్మిస్తున్నారు అని.. కొత్త జంటలు శోభనం చేసుకోవాలనుకుంటే హాల్లో చేసుకునిబెడ్‌రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితిఉన్నదనిఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో సోషల్ మీడియాను షేక్ చేసాయి. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే లేపుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి