ఇలాంటి సమయంలో అటు అమెరికా తైవాన్ ను అన్ని రకాల సహాయ సహాయ సహకారాలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ దేశానికి సంబంధించిన ఎంతో అద్భుతమైన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూడా తైవాన్ కు ఇచ్చింది అమెరికా. ఈ క్రమంలోనే తైవాన్ చైనా సరిహద్దుల్లో అమెరికా ఎఫ్ 16 యుద్ధ విమానాలను మొహరిస్తూ అటు చైనా కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో అమెరికాకు సంబంధించిన 50 వేల మంది సైనికులు అటుచైనా సరిహద్దుల్లో తైవాన్‌కు ట్రైనింగ్ ఇస్తూ యుద్ధ విన్యాసాలు చేయిస్తూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అమెరికా కు సంబంధించిన ఎఫ్ 16 యుద్ధ విమానం మీద నమ్మకంతో అద్భుతమైన సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం మా దగ్గర ఉంది అంటూ చైనాకు హెచ్చరికలు జారీ చేస్తుంది తైవాన్. కాని తైవాన్ ఎంతగానో నమ్మకం ఉంచుకున్న ఎఫ్ 16 యుద్ధ విమానం ఇటీవలే యుద్ధ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇలా ఎంతో అద్భుతం అంటూ చెప్పుకుంటున్న యుద్ధ విమానం కుప్ప కూలిపోవడంతో తైవాన్ కు షాక్ తగిలింది. దీంతో తమను భయపెట్టేందుకు తైవాన్ చేస్తున్న యుద్ధ విన్యాసాల్లో ఇక ఏకంగా అమెరికాకు చెందిన అత్యద్భుతమైన ఎఫ్ 16 కుప్పకూలడంతో చైనా ఒక్కసారిగా నవ్వుకుంది.