తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకమైన నేత. మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కీలక నేత కావడంతో పాటు పార్టీలో సీనియర్ నేత కావడంతో చంద్రబాబు ఆయనకు ఎప్పుడు పెద్ద ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. రెడ్డి సామాజికవర్గం నుంచి వైసీపీ నేతల పై మాటల దాడి చేయాలంటే తెలుగుదేశం పార్టీలో reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కరే ముందుగా కనిపిస్తారు. అందుకే చంద్రబాబు ఆయన వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా కూడా ఐదు సార్లు పార్టీ టికెట్ ఇచ్చారు.

అయితే ఇటీవల కాలంలో reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాగా స్లో అయిపోయారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు ఆయన మాటకు విలువ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా సోమిరెడ్డిని బాబు బాగా లైట్ తీసుకుంటున్నారట. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సోమిరెడ్డి ఏ మాత్రం పట్టించుకోలేదని... అందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని బాబు భావిస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లోనూ సర్వేపల్లి సీటును సోమిరెడ్డికి ఇవ్వ‌రని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు సోమిరెడ్డి పై పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేప‌ల్లిలో మళ్లీ సోమిరెడ్డికి పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఉపయోగం లేదని... ఈ సారి అక్కడ కొత్త‌ అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. దీనిపై సోమిరెడ్డికే క్లారిటీ ఇచ్చేశార‌ని కూడా టాక్ ?

సోమిరెడ్డి గట్టిగా పట్టుబడితే ఆయనకు నెల్లూరు ఎంపి సీటు లేదా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తార‌ట‌. అంతేకాని ఈసారి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్‌ రాదని అంటున్నారు. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా ఏకచక్ర ఆధిపత్యంతో టిడిపిలో కింగ్‌గా ఉన్న సోమిరెడ్డి ఆధిపత్యానికి చంద్రబాబు తెర‌దించేశార‌ని పార్టీ వర్గాల్లో వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: