ఇటీవలి కాలంలో ఇండియా అన్ని రంగాల్లో శరవేగంగా వ్యూహాత్మకంగా దూసుకుపోతున్న తీరు అగ్రరాజ్యాలకు సైతం షాక్ ఇస్తోంది.  మేము ప్రపంచ దేశాలలో నెంబర్ వన్.. మాకంటే సమర్ధులు ఎవరూ లేరు అని చెప్పుకునే అగ్రరాజ్యాలకు కూడా సాధ్యం కాని రికార్డులను ప్రస్తుతం భారత సాధిస్తుంది. కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన సవాళ్లను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కుంది భారత్.  35 కోట్ల జనాభా ఉన్న అగ్రరాజ్యాలతో పోల్చి చూస్తే 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో  వైరస్ ప్రభావం చాలా తక్కువగానే ఉంది అని చెప్పాలి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ వ్యాక్సిన్ విషయంలో అగ్రరాజ్యాల పై ఆధారపడక తప్పదు అని కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో ఎంతోమంది నిపుణులు అంచనా వేశారు.


 కానీ ఎవరు ఊహకందని విధంగా అగ్రరాజ్యాలకు షాక్ ఇస్తూ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకుంది భారత్. అంతే కాదు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను అందించడం కూడా మొదలు పెట్టింది. చిన్న దేశాలకు వ్యాక్సిన్ సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటూ వస్తుంది భారత్.ఇక అటు వాక్సినేషన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే భారత్ ఏకంగా 150 కోట్ల వాక్సినేషన్ మార్కును దాటేసింది. అగ్రరాజ్యాలతో పోల్చిచూస్తే ఇది రెట్టింపు అనే చెప్పాలి. మేమే అగ్రదేశాలం అంటూ చెప్పుకునే అమెరికా బ్రిటన్ లాంటి ఎన్నో దేశాలకు భారత్ సత్తా ఏంటో తెలుస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. వ్యాక్సినేషన్ గణాంకాలు అగ్రరాజ్యాలతో పోల్చిచూస్తే.. 2.5 నెలల్లోనే భారత్ ప్రపంచ వ్యాప్తంగా అరుదైన రికార్డు సాధించింది అన్నది ఇటీవల అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అమెరికాలో డిసెంబర్ 2020లో వ్యాక్సినేషన్ మొదలయ్యింది.. ఇప్పటివరకు అమెరికాలో 51 కోట్ల 52 లక్షల వ్యాక్సిన్ లు మాత్రమే అందజేసారు. యూనియన్ లో కూడా ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది కాగా ఇప్పటివరకూ 75.70 కోట్లు వ్యాక్సిన్ లు అందజేశారు. ఇండియాలో అక్టోబర్ 2021 న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇలా అగ్రరాజ్యాలు సాధించింది భారత్ రెండు నెలల్లోనే సాధించింది అని రికార్డులు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: