కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేసింది. లక్షల మంది జీవితాల్లో చీకట్లు నిపింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఒక్క చిన్న జీవ కణం.. మొత్తం ప్రపంచాన్నే రెండేళ్ల నుంచి వేధిస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధి కోల్పోయారు.. మరెందరో ఉద్యోగాలు కోల్పోయారు.. లక్షలాది మంది తలరాతలు మారిపోయాయి. అప్పటి వరకూ దర్జాగా బతికిన వాళ్లు కూడా బికారులయ్యారు. ఇది చాలా మంది సామాన్యుల సంగతి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపని రంగం అంటూ లేనేలేదు.


కరోనా మొదటి విడతలో లాక్‌డౌన్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరిగింది. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. మరికొందరి వ్యాపారాలు మూతబడ్డాయి. ఓ అంచనా ప్రకారం కరోనా ప్రారంభం నుంచి దాదాపు 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. ఇది మనలో చాలా మందికి స్వానుభవం.. మనం చూసిన జీవితాలెన్నో.. మనకే తెలిసిన కథలు, వ్యథలు ఎన్నో.


అయితే.. పరిస్థితి అందరికీ ఒకేలా లేదు. ఈ కరోనా సమయంలో కొందరు మాత్రం విపరీతంగా సొమ్ములు వెనకేసుకున్నారు. వందల, వేల కోట్ల లాభాలు చవి చూశారు. ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ నివేదిక ఈ విషయం స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం కరోనా సమయంలో 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10 ధనవంతుల ఆదాయం మాత్రం డబల్ అయిపోయిందట. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితులపై ఆక్స్‌ఫామ్‌ నివేదిక లెక్కలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం.


ప్రపంచ వ్యాప్తంగా ధనికుల సంపద రూ.52 లక్షల కోట్ల నుంచి రూ. 112 లక్షల కోట్లకు చేరిందట. వీరిలో ఎలాన్‌ మస్క్ రూ.22.5లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.   రూ.15 లక్షల కోట్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.  ఈ కరోనా సమయంలో రోజుకో బిలియనీర్‌ పుట్టుకొచ్చాడని ఈ నివేదిక చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: