ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ నాటకాన్ని నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శన పై ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. చింతామణి అనే నాటకం దశాబ్దాల నుంచి ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే.. అందులో సుబ్బిశెట్టి అనే పాత్ర ఉంటుంది. ఇది కాస్త హాస్య ప్రధానంగా ఉంటుంది. అందులోనూ ఓ వేశ్య చుట్టూ తిరిగే పాత్ర.. ఈ చింతామణి నాటకంలో ఇది చాలా ప్రధాన పాత్ర.. వేశ్యాలోలులైన సుబ్బిశెట్టిని చింతామణి, ఆమె తల్లి ఎలా వాడుకుంటారు అన్నది హాస్య ప్రధానంగా సంభాషణలు ఉంటాయి. ఈ పాత్ర పోషించే వారు కూడా వాచకం పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.


బొంగురు గొంతులో ఈ పాత్రను రక్తి కట్టిస్తారు. ఈ చింతామణి నాటకం ఆంధ్రదేశంలో చాలా ఫేమస్.. అయితే.. చింతామణి నాటకంలోని సుబ్బి శెట్టి పాత్ర పై మొదటి నుంచి కూడా వైశ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నాటకం బహుళ ప్రజాదరణ పొందడంతో ఆ పాత్రను ఏమీ చేయలేకపోయారు ఇప్పటి వరకూ. అంతే కాకుండా సీరియస్‌గా సాగే నాటకంలో సుబ్బిశెట్టి పండించే హాస్యం నాటకం విజయంలో కీలక పాత్ర పోషించింది.


అయితే.. ఇప్పుడు ఎన్నాళ్ల నుంచో ఈ నాటకాన్ని నిషేధించాలన్న వైశ్యుల డిమాండ్‌ను ఇప్పుడు జగన్ ప్రభుత్వం నెరవేర్చింది. వైశ్యులను కించపరిచే  విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలని నిర్ణయించింది. ఆర్యవైశ్య సంఘాలు ఈ విషయంపై గతంలో చాలాసార్లు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశాయి. అయితే.. గత పాలకులు ఈ విజ్ఞాపనలను పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఏ స్థాయిలో పరపతి ఉపయోగించారో లేదా.. జగనే వారి విజ్ఞప్తి సమంజసం అనుకున్నారో తెలియదు కానీ.. మొత్తానికి ఏపీలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతామణి నాటకం ఏపీలో ప్రదర్శించకుండా తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను  అదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: