భారత్ దూసుకుపోతుంది. ఒక రంగంలో కాదు దాదాపు అన్ని రంగాలలో కూడా. ముఖ్యంగా ఆయుధాల తయారీలో అయితే భారత్ కొత్త పుంతలు తొక్కుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే పరిమితమైన ఆయుధ విక్రయాల వ్యాపారంలోకి ఇటీవలే అడుగుపెట్టిన భారత్ ఎన్నో చిన్న దేశాలకు ఆయుధాలకు విక్రయిస్తూ ముందడుగు వేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇక ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది భారత్.


 ఈ క్రమంలోనే అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణి వ్యవస్థ లను తయారు చేస్తూ ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చుతుంది  అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా లైట్ వెయిట్ యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తూ  భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ దూసుకుపోతుంది. భారత ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ప్రోత్సాహకం అందుతూ ఉండడంతో తిరుగులేని విధంగా కొత్త ఆయుధాలను తయారు చేస్తుంది డి ఆర్ డి ఓ. ఇకపోతే ఎన్నో నెలల నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే  రోజు రోజుకి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇక భారత ఆర్మీ ఎంతో పటిష్టవంతంగా పోరాటం చేసేందుకు  ఆయుధాలను అభివృద్ధి చేస్తుంది భారత రక్షణ పరిశోధన సంస్థ.



 అయితే ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నాయి. యుద్ధంలో ఎంతో ముఖ్యమైనటువంటి యుద్ధ ట్యాంకులు ఈ కొండ ప్రాంతాల నుంచి ముందుకు వెళ్లడం ఎంతో కష్టతరమైన పని. ఇది శత్రు దేశాలకు ఎంతో ప్లస్ గా మారే అవకాశముంది. అయితే ఇలాంటి సమస్యను అధిగమించేందుకు ఇటీవలే డి ఆర్ డి ఓ సరికొత్త ఆయుధాన్ని తెరమీదకు తీసుకు వచ్చింది. కొండా ప్రాంతాలను కూడా ఎంతో సులభంగా ఎక్కగల లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకులను తయారుచేసింది  డి ఆర్ డి ఓ. భారత సైన్యానికి దాదాపు ఐదు వందల యుద్ధ ట్యాంకులు అవసరం ఉన్నాయని నివేదిక సిద్ధం చేయగా ఈ యుద్ద ట్యాంకులను తయారు చేయడంలో నిమగ్నమై అయింది డిఆర్డిఓ.

మరింత సమాచారం తెలుసుకోండి: