ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకుంటూ హౌరా అనిపిస్తుంటారు. ఇప్పటికే సరికొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో అంతులేని ఆదరాభిమానాలు సంపాదించాడు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో పథకాలు  తీసుకొచ్చి విద్యార్థులకు మంచి విద్యా అందాలనే లక్ష్యంతో  ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే  ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలోని మెనూలో కీలక మార్పులు చేయించారు. మరి అది ఏంటో తెలుసు కుందామా..?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఇప్పటికే అమలులో ఉన్న  మధ్యాహ్న భోజన పథకంలో స్వల్ప మార్పులను జగన్ సర్కార్ చేయ నుంది. పథకం అమ లులో భాగంగానే ప్రతి గురువారం రోజున  అందించె టువంటి మధ్యాహ్న భోజనానికి బదులుగా ఇడ్లీ మరియు సాంబారు ఇవ్వాలని  విద్యాశాఖ అధికారులు కొత్త నిర్ణయం తీసు కున్నారు. దీనికోసం  గుంటూరు జిల్లాలోని  తాడేపల్లి మండలంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక అయ్యాయి.

 ఈ మండలంలోని చిర్రపూర్ జడ్పీహెచ్ ఎస్ ఈ యొక్క కొత్త మెనూ ప్రకారమే సాంబార్ మరియు ఇడ్లీ వచ్చే వారం నుండి వడ్డీంచనున్నారని సమాచారం. ఈ పథకాన్ని తాడేపల్లి మండలం లోని ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు  ప్రతి గురువారం రోజున  మధ్యాహ్న సమయంలో ఒక్కొక్కరికి 4 ఇడ్లీ లు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 5 ఇడ్లీల చొప్పున    అందిస్తామని  మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసే జిల్లా అధికారి  శ్రీనివాసరావు తెలియ జేశారు. గతంలోని పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం రోజున ఉడికించిన గుడ్డు, టమాటా చట్నీ, కిచిడి  వంటివి అందజేస్తూ వచ్చారు. ఇలా జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఏదో ఒక  పెద్ద ఆలోచనా త్మక విషయమే ఉంటుందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: