దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ రెండు దశల కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం అల్లాడిపోయింది. ప్రతీ రాష్ట్రంలో కూడా భారీగా కేసులు వెలుగులోకి రావడంతో అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెండవ దశలో అయితే దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏ క్షణంలో ఎవరి ప్రాణం పోతుందేమో అని అనుక్షణం ప్రతి ఒక్కరూ భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండవ దశ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అనుకుంటున్న సమయంలోనే ఇప్పుడు మరోసారి దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో మూడవ దశ ప్రారంభం అయింది అని తెలుస్తోంది. మొన్నటి వరకు అతి తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఇక ఇప్పుడు మళ్ళీ లక్షల్లోకి  వెళ్ళిపోయింది.


 ప్రతిరోజు  లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తుండడంతో అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ పై పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్ లు మాత్రం అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏకంగా 55 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రయాణికులు అందరికీ షాక్ ఇచ్చింది.


 అయితే ఇలా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు లో నడిచే 55 రైళ్లను రద్దు చేస్తున్నాము అంటూ ఇటీవలే ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.. ఇక ఈ 55 రైళ్లను ఈనెల 21 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పుడు ఈ తేదీని పొడగిస్తూ ఈ నెల 31 వరకు కూడా రైళ్లను రద్దు చేస్తామని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఏకంగా 55 రైళ్లు రద్దు కావడంతో అటు ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: